సంఖ్యా బలం ఉంటేనే ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తుంది..

-సదస్సు కు తరలిన కాంట్రాక్ట్ అధ్యాపకులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి : యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ చలో కాకతీయ యూనివర్సిటీ సదస్సుకు తెలంగాణ యూనివర్సిటీ నుండి కాంట్రాక్ట్ అధ్యాపకులు మంగళవారం భారీ ఎత్తున తరలి వెళ్ళినట్లు తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బి దత్త హరి తెలిపారు. ఈ కార్యక్రమానికి అయ్యర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ పాపి రెడ్డి, సామాజిక వేత్త, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్  లైవ్ లో పాల్గోని మాట్లాడుతూ సంఖ్యా బలం ఉంటేనే ప్రభుత్వాలు దిగివచ్చి యూనివర్సిటీ కాంటాక్ట్ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తుందన్నారు.రాష్ట్రంలో ఉన్న 12 యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు అందరూ ఒకే మాట మీద ఉన్నట్లయితే ప్రభుత్వం దిగివచ్చి మీ సమస్యలను పరిష్కారం చూపిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు కూడా రెగ్యులరైజ్ కావాలని తన ఆశయమని మాజీ చైర్మన్ పాపి రెడ్డి పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయటానికి బలమైనటువంటి కారణం సంఖ్యా బలం ఉంటేనే ప్రభుత్వం దిగివచ్చి యూనివర్సిటీ కాంటాక్ట్ ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని, నిజంగా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉపాధ్యాయు లైనటువంటి యూనివర్సిటీ స్థాయి టీచర్ ఒక సామాన్యుడిని మేధావిగా తయారు చేసే యూనివర్సిటీలని, ఆ యూనివర్సిటీలో ఒక కాంట్రాక్టు ఉపాధ్యాయుడు 300 నుంచి 500 మంది ఓటర్లు మార్చే శక్తి ఉంటుందన్నారు. సంఖ్యా బలం చాలా బలమైందని, యూనివర్సిటీలో మేధావుల వర్గం ఎప్పుడు కూడా చర్చిస్తూ మన సమస్యలను పరిష్కారం చూపాలని ప్రభుత్వం కు అభ్యాసిస్తూ వీరందరిని త్వరగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ కలిసి ఉంటేనే బలం, అదే బలగం భవిష్యత్తులో అదే ప్రభంజనం సృష్టిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత అరుణాకర్ వ్యవహరించారు.ఈ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ పరశురాం, ప్రేమ్ కుమార్, జితేందర్ రెడ్డి, పీజీ కళాశాల సికింద్రాబాద్ వేల్పు కుమార్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యక్షులు శ్యాం కుమార్, శాతవాహన యూనివర్సిటీ అధ్యక్షులు యశ్వంత్ రావు, జేఎన్టీయూ అధ్యక్షులు సురేష్,  డాక్టర్ గోబిరాజ్, డాక్టర్ శరత్ కుమార్, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ దేవరాజ్ శ్రీనివాస్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు.
Spread the love