మిజోరంలో హచెక్‌ సీటు ఎవరికి దక్కెన్‌..!

–  ఓటర్ల చేతుల్లోనే అభ్యర్థుల భవితవ్యం
హచెక్‌. ఈశాన్య ప్రాంతంలో ఉన్న మిజోరంలో నవంబర్‌ 7న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 174 మంది అభ్యర్థులు తమ అదష్టాన్ని పరీక్షించుకోనున్నారు. త్రిపుర సరిహద్దులో పశ్చిమ మిజోరంలోని మమిత్‌ జిల్లాలో ఉన్న హచెక్‌, రాష్ట్రంలోని హాట్‌ సీట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సీటు ఎవరికి దక్కుతుందో నిర్ణయించడంలో బ్రూ , ఇతర మైనారిటీ ఓటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఒక దశాబ్దం క్రితం జాతి అల్లర్ల తర్వాత 35 వేల మందికి పైగా బ్రూ ప్రజలు త్రిపురకు వలస వచ్చినప్పటికీ, దాదాపు ఐదువేల మంది గిరిజనులు అలాగే ఇతర చిన్న మైనారిటీ తెగలు హచెక్‌ సీటులో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉన్నారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది.

Spread the love