హాజిల్‌వుడ్‌ ఫిట్‌?!

లండన్‌ : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు పేసర్‌ జోశ్‌ హాజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌పై ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన కనిపిస్తుంది. ఐపీఎల్‌లో బెంగళూర్‌ తరఫున 3 మ్యాచులు ఆడిన హాజిల్‌వుడ్‌ గాయంతో నిష్క్రమించాడు. ప్రస్తుతం లండన్‌లోని ఆసీస్‌ శిబిరంలో చేరిన హాజిల్‌వుడ్‌ జూన్‌ 7 మెగా పోరు సమయానికి మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే సానుకూల దృక్పథం కంగారూ క్యాంప్‌లో కనిపిస్తుంది. భారత్‌తో ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ అనంతరం ఇంగ్లాండ్‌తో కీలక యాషెస్‌ సిరీస్‌, కరీబియన్‌, సఫారీ పర్యటనల నేపథ్యంలో హాజిల్‌వుడ్‌ ఫిట్‌నెస్‌ ఆసీస్‌కు కీలకంగా మారింది. నా ఫిట్‌నెస్‌ బాగుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సమయానికి సిద్ధమవుతానని ఆశిస్తున్నట్టు హాజిల్‌వుడ్‌ చెప్పాడు.

Spread the love