మా సమస్యలు తిర్చేదేన్నడు..

– టీయూ కాంట్రాక్ట్ అధ్యాపకులు..
నవతెలంగాణ-డిచ్ పల్లి : తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు రెగ్యులరైజ్ చేయాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి, కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొని మాట్లాడుతూ న్యాయపరంగా రెగ్యులరైజ్ అయ్యేవరకు అందరం సమిష్టిగా పోరాటం చేస్తామని, కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరగబోయే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల కాంట్రాక్టు ఉపాధ్యాయులు పాల్గొంటారని, ఈ మేధావుల సదస్సు ప్రోఫెసర్ హరగోపాల్  ఇంక్లెక్షన్స్ అందరు కలిసి కాంట్రాక్ట్ లెక్చరర్ ఏజెన్సీ నిబంధన ప్రకారం ఏ విధంగా రెగ్యులరైజ్ చేస్తారో వివరించాడం జరుగుతుందని, యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు, డిగ్రీ కాలేజీలో పనిచేసిన ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేసినప్పుడు యూనివర్సిటీ కాంటాక్ట్ అధ్యాపకులు ఎందుకు రెగ్యులర్ చేయరాదో ఈ కార్యక్రమంలో తేట తేల్లాం అవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మేధావులు హరగోపాల్ తోపాటు సెంట్రల్ యూనివర్సిటీ 12 యూనివర్సిటీల ప్రతినిధులు, అధ్యక్షులు, జాక్ కన్వీనర్లు, వివిధ యూనివర్సిటీకి చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరు పాల్గొని కాకతీయ యూనివర్సిటీలో జరగబోయే ఆల్ యూనివర్సిటీస్ ఉపాధ్యాయుల సదస్సును విజయవంతం చేద్దామని తెలంగాణ యూనివర్సిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి తెలిపారు. ఈ నిర్ణయంలో తెలంగాణ కాంట్రాక్టు ఉపాధ్యాయులందరూ ఓకే మాట ఒకే బాట రెగ్యులరైజ్ టు సర్వీస్ ఇదే మా మాట ఇది తెలంగాణ యూనివర్సిటీ గుండె చప్పుడన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జలంధర్ డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ గంగ కిషన్, డాక్టర్ శరత్, డాక్టర్ మోహన్, కిరణ్ రాథోడ్, డాక్టర్ జోష్నా, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ అపర్ణ, డాక్టర్ రమ్య ,డాక్టర్ నర్సయ్య, డాక్టర్ గోపిరాజ్ ,డాక్టర్ నాగేశ్వరరావు ,డాక్టర్ డానియల్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love