దళితుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి

నవతెలంగాణ-దుబ్బాక రూరల్ : నేడు అక్బరుపేట భూంపల్లి మండల కేంద్రంలో జరిగే దుబ్బాక నియోజకవర్గం దళితుల ఆత్మీయ సమ్మేళనానికి భారీ సంఖ్యలో పాల్గొని దళితుల ఐక్యత చాటి చెప్పాలి. ఈకార్యక్రమానికి దళితులైన ఎస్సీ ఎస్టీ భారీ ఎత్తున తరలి రావాలని దుబ్బాక ఆత్మీయ సమ్మేళన కమిటీ సభ్యుడు  మల్లుగారి ప్రేమ్ పిలుపునిచ్చారు. సోమవారం దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెళ్లి లో వారు మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం దళితులకు దళిత బంధు పథకం కింద 10 లక్షలు , సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం దళితులకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ నడి ఒడ్డున 25 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. సీఎం  కేసీఆర్  తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.దళితులైన ఎస్సీ ఎస్టీ నియోజవర్గంలోని ప్రజాప్రతినిధులు,  ఎంపీపీలు, జెడ్పిటిసిలు , మున్సిపల్ కౌన్సిలర్లు ,సర్పంచులు ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, దేవస్థానం కమిటీ డైరెక్టర్లు ,బీఆర్ఎస్  సీనియర్ నాయకులు కార్యకర్తలు  ఉదయం 10 గంటలకు అక్బర్ పేట భూంపల్లిలో  ఎస్ బీఆర్ గార్డెన్లో జరిగే మీటింగ్ కి అందరూ హాజరు కావాలని కోరారు.ఈకార్యక్రమానికి  మెదక్ ఎంపీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు
Spread the love