ఫారెస్ట్ పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి..

నవతెలంగాణ-రాజంపేట్ : ఫారెస్ట్ పోడ్ భూములకు పట్టాలు ఇవ్వాలని ఒకవైపు ఫారెస్ట్ పోడు భూములకు పట్టాలు ఇస్తామని రెండో వైపు పోడు భూములు గుంజుకుంటున్న ఫారెస్ట్ అధికారులు.. ఇది అత్యంత దుర్మార్గమని . సిపిఎం ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు..అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొండాపూర్ షేర్ శంకర్ తండా పరిధిలో సుమారు వందల ఎకరాల భూమిని సాగులో ఉన్న వారిని విడిపించి చెట్లు నాటే కార్యక్రమాన్ని ఫారెస్ట్ అధికారులు పూనుకోవడం దూరదృష్టమని అన్నారు జూన్ 26న పాస్ బుక్ ఇస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు దుందుడు విహారలు పాల్పడుతున్నారని అది మానుకోవడం మంచిదని అన్నారు. 2005 చట్టం అంటే దున్నితేనే కాదు అక్కడ పశువుల మేత కోసం కావచ్చు పండగలు పబ్బుగల శీతల లాంటి పండగ కోసం కావచ్చు ఇటువంటి భూములు కూడా 2005 చట్టం డిసెంబర్ 13 వర్తిస్తుందని అన్నారు. అందుకనే అటువంటి భూమిని కూడా సర్వే చేసి పోడు హక్కు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులకు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో నాయకులు తాండవాసులు పాల్గొన్నారు.

Spread the love