నీటితో ఆరోగ్యం

ఆరోగ్యం కాపాడుకోవడానికి నీరు చాలా అవసరం. నీరు శరీర ప్రక్రియ. క్రియలలో ప్రధాన పాత్ర వహిస్తుంది.
ఒక వ్యక్తి ప్రతిరోజూ తన శరీర బరువుతో ప్రతి కేజీకి 30 ఎం.ఎల్‌. నీరు తప్పనిసరిగా తీసుకోవాలి.
(రీనల్‌, కార్టియాక్‌ పేషెంట్స్‌కి ఇది మినహాయింపు. డాక్టర్‌ సలహా ప్రకారం తీసుకోవాలి)
ఎందుకంటే శరీర ఆరోగ్యానికి నీరు అత్యంత ముఖ్యమైనది.
 హైడ్రేషన్‌ : శరీరంలో ప్రతికణం, కణజాలం, అవయవం సరిగా పనిచేయాలంటే నీరు తప్పనిసరిగా అవసరం.
 శోషణ : నీరు పోషకాల శోషణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కీళ్లలో ద్రవాలను ప్రోత్సహిస్తూ ‘బూట్రికెంట్‌’గా పనిచేస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో తోడ్పడుతుంది.
 నిర్షీకరణ : మూత్రపిండాల పనితీరుకు నీరు చాలా అవసరం. ఎందుకంటే రక్తం నుండి వ్యర్థాలను, విషకారకాలను ఫిల్టర్‌ చేయడంలో సహాయపడుతుంది.
 చర్మ ఆరోగ్యం : నీరు చర్మ కణాలను హైడ్రేట్‌ చేయడంలో సహాయపడుతుంది. వయసు తక్కువగా కనిపించడానికి సహాయపడుతుంది.
నీరు సున్నా కేలరీలను కలిగి వుండడం వల్ల బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
 అభిజ్ఞాన పనితీరు : నీరు సరిగా తీసుకోవడం వలన మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
డీ హైడ్రేషన్‌ వలన శ్రద్ధ, జ్ఞపకశక్తి దెబ్బతింటుంది. అందువలన తగినంత నీరు తాగడం వల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్‌, పోషకాలు అందుతాయి. మానసిక స్పష్టత, దృష్టికి మద్దతు ఇస్తుంది.
మంచి ఆరోగ్యానికి రోజంతా తగినంత నీరు తాగుతూ వుండాలి.
– పి.వాణి, 9959361180

Spread the love