తడిసిన ధాన్యంతో పోలింగ్‌ కేంద్రానికి.. పోలింగ్‌ బహిష్కరించిన రైతులు

– తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఓటింగ్ ను బహిష్కరించిన రైతులు…
– తాసిల్దార్ హామీతో ఓటు వేయడానికి ఒప్పుకున్న రైతులు…
నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి మండల వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా బస్తాలు ధాన్యం తడిచింది. కాగా సుమారు 70,000 ఐకెపి కేంద్రాలలో కొనుగోలు చేసిన బస్తాలో ధాన్యం సైతం తడిసింది. ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ మిల్లుకు తరలించకపోవడంతో 70 వేల బస్తాలు త్రవ్వడం పట్ల రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తూ , ఆదివారం కనుముక్కల గ్రామంలో ధర్నా నిర్వహించారు. విషయం తెలిసిన పోచంపల్లి తాసిల్దార్ ఎస్సై వెంటనే అక్కడికి చేరుకొని, తడిసిన ధాన్యాన్ని కొంటాము అని తాసిల్దార్ హామీ ఇవ్వడంతో ధర్నాన్ని విరమింప చేసినట్లు తెలిపారు. కాగా ఇటీవలనే ఫిలాయిపల్లి గ్రామంలోని బాలాజీ రైస్ మిల్ యజమాని ధాన్యం అన్లోడ్ చేసుకోవాలంటే లారీ డ్రైవర్ పై చేయించుకొని, లారీ అద్దాలు పగలగొట్టడం పట్ల లారీ డ్రైవర్లు అందరూ ధర్నా నిర్వహించారు. గత మూడు రోజులుగా కొనుగోలు చేసినప్పటికీ మిల్లులకు తరలించలేదు. దీంతో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి దాన్యం తడిచి ముద్దయింది. వెంటనే దాన్ని కొనుగోలు చేయాలని రైతులకు డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్తో రైతులు ఓటింగ్ని బహిష్కరించగా, వెంటనే తాసిల్దార్ దాని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పాక వెంకటేష్ యాదవ్, పాక నరసింహ కోట అంజిరెడ్డి దారేపల్లి రాజిరెడ్డి, మట్టిపల్లి ఐలయ్య, చుక్క ఇస్తారి, నూకల లింగస్వామి, కొత్త లింగం, జంగారెడ్డి, అలగపెల్లి ఐలయ్య తోపాటు పలువురు పాల్గొన్నారు.

Spread the love