ఢిల్లీ, ఎన్సీఆర్‌లలో భారీవర్షాలు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. ఆదివారం రాత్రంతా కురిసిన వర్షాల కారణంగా సోమవారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. సోమవారం సూర్యోదయానికి ముందే ఢిల్లీ నగరంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, రోహ్‌తక్ ప్రాంతాలతో సహా మొత్తం ఢిల్లీ, ఎన్‌సిఆర్‌ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో కూడిన వర్షం కురుస్తోంది. వచ్చే 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.

Spread the love