తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు…

నవతెలంగాణ – న్యూఢిల్లీ: డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారులకు మళ్లీ నిరాశే ఎదురయింది. గత రెండు మూడు నెలలుగా ప్రతి ఒకటో తారీఖున వాణిజ్య అవసరాలకు  వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరను స్వల్పంగా తగ్గిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. రికార్డు స్థాయికి చేరిన గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ ధరలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నింటిన నేపథ్యంలో ప్రతి నెల రూ.1200 వెచ్చించి సిలిండర్‌ బండను కొనడానికి ఇబ్బందిపడుతున్న సాధారణ ప్రజలు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.83.50 మేర తగ్గించింది. దీంతో ఢిల్లీలో నాన్‌ డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.1773కు పడిపోయింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.

Spread the love