Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఎంత కష్టం..ఎంతో నష్టం

ఎంత కష్టం..ఎంతో నష్టం

- Advertisement -

వెనిజులాలో సంభవించిన
భూకంపంతో జనం అవస్థలు

వెనిజులా భూకంపం సృష్టించిన విధ్వంసంలో ఇప్పటివరకు 4,300 మంది చనిపోయారు. శిధిలాల కింద ఉన్నవారు బతికి ఉన్నారో.. చనిపోయారో తెలియదు. సహాయక చర్యలకు వచ్చిన ఇతర దేశాల బృందాలు తిరిగి వెళ్లిపోయాయి. అయినా తమ వారి కోసం కుటుంబ సభ్యులు అన్వేషిస్తూనే ఉన్నారు. కూలిపోయిన భవనాల శిథిలాలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రకృతి కన్నెర్రతో తమకు ఎంత కష్టం వచ్చింది.. ఎంతో నష్టం జరిగిదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కూలిన శిధిల భవనాల వ్యర్థాలను తీయటానికి యంత్రాలు అందుబాటులో ఉండాలి. కానీ ఎలాంటి సౌకర్యాలు లభ్యం కావటంలేదని వాపోతున్నారు. నిలువనీడ కోల్పోయిన కుటుంబాలు స్థానిక స్వచ్ఛంద కార్యకర్తల సాయంతో తాళ్ళను ఉపయోగించి వ్యర్థాలను తీసే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -