Tuesday, July 14, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅక్టోబర్‌ 27న ఇజ్రాయిల్‌లో ఎన్నికలు

అక్టోబర్‌ 27న ఇజ్రాయిల్‌లో ఎన్నికలు

- Advertisement -

జెరుసలేం : ఇజ్రాయిల్‌లో అక్టోబర్‌ 27వ తేదీన ఎన్నికలు జరుగుతాయని ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ప్రభుత్వ సంకీర్ణ కూటమి అధిపతి ఒఫిర్‌ కట్జ్‌ తెలిపారు. 2023లో హమాస్‌ దాడులు, ఆ తర్వాత గాజా, లెబనాన్‌, ఇరాన్‌లో జరిగిన యుద్ధాల అనంతరం తొలిసారిగా ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇజ్రాయిల్‌ పార్లమెంటును మేలో రద్దు చేసిన నేపథ్యంలో ఎన్నికల తేదీపై ఇప్పటి వరకూ అనిశ్చితి నెలకొంది. సంకీర్ణ అధిపతి కట్జ్‌ ఆదివారం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ చట్ట ప్రకారం అక్టోబర్‌ 27న ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నదని, కాబట్టి అదే రోజు పోలింగ్‌ జరుగుతుందని చెప్పారు. కాగా నేషనలిస్ట్‌, ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన నెతన్యాహూ సంకీర్ణ ప్రభుత్వానికి ఎన్నికలలో పరాజయం తప్పదని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్‌ యుద్ధం విషయంలో నెతన్యాహూ వైఖరిపై మెజారిటీ పౌరులు అసంతృప్తితో ఉన్నారని అవి తెలిపాయి. ఇజ్రాయిల్‌లో నాలుగేండ్ల పదవీకాలాన్ని ప్రభుత్వం పూర్తి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేత నెతన్యాహూనే. అయితే ఇప్పుడు ఆయన రేటింగ్‌ బాగా పడిపోతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -