ఇలాంటివి వందలు జరిగాయి

– అందుకే ఇంటర్నెట్‌ను నిషేధించాం
– మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్‌ సీఎం బీరేన్‌
– మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం!
– మణిపూర్‌ అధికారుల నుంచి స్పందన లేదు :ఎన్‌డబ్ల్యూసీ చైర్‌ పర్సన్‌
ఇంఫాల్‌ : మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళల్ని నగ్నంగ ఊరేగించిన ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంటే.. మరోవైపు ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో కొన్ని వందలు జరిగాయని, అందుకే ఇంటర్నెట్‌ను నిషేధించామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ చెప్పడం మరింత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మహిళల్ని నగంగా ఊరేగించిన సంఘటనలో దోషులపై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి పై విధంగా సమాధానం ఇచ్చారు. ఇద్దరు మహిళల్ని ఊరేగించి, అందులో ఒకరిపై సామూహిక మానభంగం జరిగిన దారుణ ఘటన మే 4న జరగ్గా, మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. రెండు నెలల తరువాత, గురువారం ఈ కేసులో మొదటి అరెస్టు జరిగింది. అది కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన తరువాత, ‘ఈ ఘటనపై ఇంతకుముందు మీకు సమాచారం లేదా..? ఈ ఘటన మే 4న జరగ్గా మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు?’ అని ఒక వార్తా సంస్థకు చెందిన ప్రతినిధి ఫోన్‌లో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అసౌకర్యంగా ఫీలవుతూ ముఖ్యమంత్రి ‘హింసాకాండాలో అనేకమంది మరణించారు. వెయ్యికిపైగా ఎఫ్‌ ఐఆర్‌లు నమోదయ్యాయి’ అని సమాధానం ఇచ్చారు. అయినా ముఖ్యమంత్రిని వార్తా సంస్థ ప్రతినిధి మరింతగా ప్రశ్నించగా.. ‘మీరు క్షేత్ర స్థాయిలో నిజమైన పరిస్థితిని తెలుసుకోవాలి. ఇలాంటి కేసులు వందల సంఖ్యలో నమోద య్యాయి. అందుకే ఇంటర్నెట్‌ను నిషేధించాం’ అని ముఖ్యమంత్రి అసహనంతో సమాధానం ఇచ్చి, ఫోన్‌ను డిస్‌కనెక్ట్‌ చేశారు. ‘ఇలాంటివి వందలాది కేసులు ఉన్నాయి’ అని ముఖ్య మంత్రి సమాధానం ఇచ్చిన వీడియో వైరల్‌గా మారింది. వివిధ రాజకీయ పార్టీలు, జర్న లిస్టులు, ప్రజలు బిరేన్‌ సింగ్‌ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
మహిళలను నగ్నంగ ఊరేగించిన నిందితుడి ఇంటికి నిప్పు
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగిస్తున్న భయానక వైరల్‌ వీడియోలో కనిపించిన నిందితులలో ఒకరి ఇంటికి స్థాని కులు కొందరు నిప్పంటించారు. ముగ్గురు నిందితులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిం చిన తీరు దేశవ్యాప్తంగా తీవ్ర షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధిం చిన వీడియో ఒకటి బుధవారం వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన కొందరు.. నిందితుల్లో ఒకరి ఇంటిని దహనం చేశారు. ప్రధాన నిందితుడు హుయిరేమ్‌ హెరోదాస్‌ మెయిటీ ఇంటిని ఒక గుంపు తగలబెట్టిందని కొన్ని వార్త కథనాలను బట్టి తెలుస్తున్నది. నింది తుల ఇంటికి నిప్పుపెట్టిన నిరసనకారులలో ఎక్కువగా మహిళలు ఉన్నారు.
కాంగ్‌పోక్పి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను నగంగా ఊరేగించిన గుంపులో భాగమైన హుయిరేమ్‌ హెరోదాస్‌.. వారిలో ఒకరిని(మహిళను) లాగుతున్నట్టు కనిపిం చాడు. మహిళలను నగ్నంగ ఊరేగించిన ఘటనలో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. వైరల్‌ వీడియో నుంచి తీసిన స్క్రీన్‌షాట్‌ ఆధారంగా పీచీ అవాంగ్‌ లైకైకి చెందిన హుయిరేమ్‌ హెరోదాస్‌ మెయిటీ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన 26 సెకన్ల వీడియోలో మొదటగా అరెస్టయిన హుయిరేమ్‌ హెరాదాష్‌ సింగ్‌ కాంగ్‌పోక్పి జిల్లాలోని బి. ఫైనోమ్‌ గ్రామం వద్ద గుంపును ప్రముఖంగా నడిపిస్తున్నట్టు పోలీసులు తెలి పారు. ”మణిపూర్‌ పోలీసులు సోదాలను నిర్వ హిస్తున్నారు. ఇతర నిందితులను వీలైనంత త్వరగా అరెస్టు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు” అని మణిపూర్‌ రాష్ట్ర పోలీసులు ట్వీట్‌ చేశారు.ఇటు వైరల్‌ వీడియోపై సుప్రీం కోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది. ఇది ”రాజ్యాంగ హక్కులకు అత్యంత తీవ్రమైన ఉల్లంఘన” అని న్యాయస్థానం పేర్కొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివరణలు కోరింది. ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూసుకోవాలనీ, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక పాలనలో తీవ్ర వైఫల్యం చెందారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ సహా పలు ప్రతిపక్షాలు మణిపూర్‌ సీఎం బీరెన్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిం చాలని డిమాండ్‌ చేశాయి. పార్లమెంటు వర్షా కాల సమావేశాల్లోనూ మణిపూర్‌ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
అది ఆకస్మికంగా జరిగింది : మణిపూర్‌ ఘటనపై అధికారులు
మణిపూర్‌లో మహిళలను నగంగా ఊరేగించిన ఘటన ఆకస్మికంగా జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ”దాడి చేసేవారు మే 3 రాత్రి నుంచి దాదాపు 9 గ్రామాల్లో సోదాలు జరుపుతున్నారు. ఆ తర్వాత రోజే ఇది (మహిళలను నగంగా ఊరేగించిన ఘటన) జరిగింది. ఇది ఒక ఆకస్మిక చర్య” అని సీనియర్‌ సెక్యూరిటీ అధికారి ఒకరు తెలిపారు.
మూడు నెలల్లో మూడు సార్లు ఫిర్యాదు చేశాం
మణిపూర్‌ అల్లర్ల నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై అధికారుల నుంచి స్పందన లేదని జాతీయ మహిళ కమిషన్‌ చైౖర్‌పర్సన్‌ రేఖాశర్మ తెలిపారు. గత మూడు నెలల్లో మూడు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, స్పందన కరువైందని పేర్కొ న్నారు. మే 4న ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం నాడిక్కడ ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో రేఖా శర్మ మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి జూన్‌ 12న జాతీయ మహిళా కమిషనకు ఫిర్యాదు వచ్చినా, ఎందుకు పట్టించుకోలేద ని విలేకరులు ఆమెను ప్రశ్నించారు. తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, జులై 19న సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌ కావడంతో సుమోటోగా స్వీకరించి.. వివరణ ఇవ్వాల్సిందిగా ఆ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశానని రేఖాశర్మ చెప్పారు. మణిపూర్‌లో పలువురు మహిళలపై జరుగు తున్న అకృత్యాల గురించి తనకు ఫిర్యాదులు అందినట్లు ఆమె అంగీకరించారు. ‘మణిపూర్‌లో మహిళలపై హింసకు సంబంధించి ఆ రాష్ట్రం నుంచి మాత్ర మే కాక ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా లేఖలు వచ్చాయి. మూడు సార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి స్పంద న లేదు. తాజా ఘటనకు సంబంధించిన వీడి యోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో సుమోటోగా స్వీకరించి.. అధికారులను వివరణ కోరాను” అని రేఖా శర్మ తెలిపారు. మే 18,29, జూన్‌ 19 తేదీల్లో అధికారులకు రాసి న లేఖలు రేఖాశర్మ మీడియాకు చూపించారు.
ఆ దారుణానికి ముందు…హత్యలు.. లూఠీలు.. ఇళ్లు, ఆస్థుల దగ్ధం…ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు
మణిపూర్‌లో ఒక గూండాల మూక ఇద్దరు గిరిజన మహిళల్ని వివస్త్రలను చేసి ఊరేగించిన దారుణ సంఘటన మే 4న జరగ్గా, దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సైకుల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ నకలును కొన్ని మీడియా సంస్థ లు సంపాదించాయి. దీని ప్రకారం గిరిజన మహిళలను నగంగాఊరేగించడానికి ముందు ఈ గూండాల మూక గ్రామాన్ని పూర్తిగా లూటీ చేయడంతోపాటు హత్యలు, ఇళ్లను తగుల బెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడింది. నగంగా ఊరేగించబడిన మహిళను రక్షించ డానికి ఆమె సోదరుడు ప్రయత్నించగా, అతన్ని దారుణంగా హత్య చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం కాంగ్పోక్పి జిల్లాలోని సైకుల్‌ పోలీస్‌ స్టేషన్‌కు దక్షిణంగా 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రా మంలోకి సుమారు 900 నుంచి వెయ్యి మంది తో ఉన్న సాయుధ గూండాల మూక మే 4న సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవేశించింది. వీరిలో చేతిలో ఎకె రైఫిల్స్‌, ఎస్‌ ఎల్‌ఆర్‌, ఐఎన్‌ఎస్‌ఎఎస్‌, 303 రైఫిల్స్‌ వంటి అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. గూండాల మూక ప్రవేశించడంతోనే గ్రామంపై విరుచుకు పడింది. విధ్వంసం సృష్టించింది. అన్ని చరాస్థు లను లూటీ చేసి ఒకచోట నేల మీద వేసి తగల బెట్టింది. ఇళ్లలోని నగదు, ఫర్నీచర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార ధాన్యాలు ఇలా అన్ని వస్తు వులను తగులబెట్టారు. ఈ దాడితో భయపడి ఐదుగురు గ్రామస్థులు సమీప అడవిలోకి పారిపోయారు. వారిని పోలీసులు రక్షిస్తే వారి వద్ద నుంచి కూడా ఆ గ్రామస్థుల్ని ఈ మూక ఎత్తుకెళ్లింది. ఈ ఘటనకు సంబం ధించిన వీడియో ఆధారంగా ఇప్పటివరకూ నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురిలో ఒకరి ఇంటిపై స్థానిక ప్రజలు ఇటీవల దాడి చేసి, నిప్పు అంటించారు. తౌబల్‌ జిల్లాలోని పేచీ అవాంగ్‌లో ఉన్న నిందితుడి ఇంటిపై ఈ దాడి జరిగినట్లు పోలీసులు చెప్పారు.
మణిపూర్‌లో మరో షాకింగ్‌..వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్‌
ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడు కుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్‌ సంఘ టన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్‌ తాజాగా వైరల్‌గా మారింది. మణిపూర్‌లో ఒక గుంపు ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన వీడియో వైరల్‌ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దానిని మరు వక ముందే ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్‌ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్‌ థీక్‌ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.
మణిపూర్‌లో శుక్రవారం మే 4న చిత్రించిన వీడియోలో మహిళ లను నగంగా ఊరేగించి, పురుషుల గుంపు పట్టుకున్నట్లు చూపడంతో కొత్త ఉద్రిక్తత నెలకొంది. మహిళలను నగంగా ఊరేగించిన వీడియో క్లిప్‌ ఈ నెల 19న సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Spread the love