సరిహద్దు పోలీసులతో హుస్నాబాద్ ఏసిపి సమావేశం

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ ఇతర జిల్లాల సరిహద్దు పోలీస్ అధికారులతో గురువారం హుస్నాబాద్ ఏసీపి సతీష్  సర్కిల్ కార్యాలయంలో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి సతీష్  మాట్లాడుతూ హుస్నాబాద్ బార్డర్ పోలీస్ స్టేషన్ కరీంనగర్, వరంగల్, జిల్లాకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు ఏదైనా సంఘటన జరిగితే సమాచారం అందించాలని సూచించారు. రాబోవు ఎన్నికల సందర్భంగా బార్డర్ చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, జనగామ జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై చర్చించారు. అదే విధంగా మద్యం, నగదు సరఫరా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యల పై ప్రత్యేకంగా చర్చించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల పోలీసులు వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసి సంబంధిత పోలీసు అధికారులు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి, సిఐలు హుస్నాబాద్ కిరణ్, ఎల్ఎండి ఇంద్రసేనా రెడ్డి, హుజురాబాద్ రూరల్ సంతోష్, ఎల్కతుర్తి సిఐ ప్రవీణ్, ఎస్ఐలు హుస్నాబాద్ మహేష్, కోహెడ తిరుపతి, అక్కన్నపేట వివేక్, చిగురుమామిడి, సైదాపూర్, వంగర, ముల్కనూర్, ఎల్కతుర్తి, వేలేరు ఎస్సైలు పాల్గొన్నారు.
Spread the love