సీపీఐ(ఎం) ఆద్వర్యంలో నిరసన

నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ,అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి కుదింపు కు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) మండల కమిటీ ఆద్వర్యం లో గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మాట్లాడుతూ భాజపా ముసుకు తో ఆర్ఎస్ఎస్ భావజాలంతో అధికారం చేపట్టిన మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదిమ కాలం నాటి బూజుపట్టిన సంప్రదాయాలను అమలు చేస్తుందని దుయ్యబట్టారు. పెట్టుబడి దారులకు,భూస్వాములకు కొమ్ము కాస్తూ మోడీ పాలన సాగిస్తున్నారని అన్నారు.అందుకోసమే ఎన్నో పోరాటాలు ఫలితంగా తెచ్చిన చట్టాలను, శాసనాలను మార్చడానికి కార్యాచరణ చేపట్టారని అన్నారు. వామపక్షాలు, విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి అనే అహంకారం పూరిత చర్యగా ఇండియా అనే పేరును మార్చి భారత దేశం అని నామకరణం చేయడానికి చూస్తుండటం రాజరిక భావనే తప్ప మరొకటి కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బి.చిరంజీవి, కమిటీ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు, తగరం జగన్నాధం, మడకం గోవిందు, తగరం నిర్మల,జగదాంబ తదితరులు పాల్గొన్నారు.
Spread the love