వ్యాయామం చేస్తే..

వ్యాయామం చేస్తే..వ్యాయామం చేయడం వల్ల ఎన్నో లాభాలుంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి రోజూ వ్యాయామం చేసి చాలా ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఊబకాయం మొదలు గుండె సంబంధిత సమస్యల వరకు ఎన్నో రకాల సమస్యలకు వ్యాయామం బెస్ట్‌ ఆప్షన్‌గా చెబుతారు. అయితే వ్యాయామంతో నిద్రలేమి సమస్య కూడా దూరమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. వారానికి కనీసం రెండు, మూడుసార్లు చేసినా రాత్రిపూట బాగా నిద్ర పడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా వ్యాయామం ఉపయోగపడుతుందట. ఈ పరిశోధన కోసం సుమారు 4400 మందిని ఎంచుకొని వారానికి ఎన్నిసార్లు, ఎంతసేపు, ఎంత తీవ్రతతో వ్యాయామం చేస్తున్నారు, నిద్రలేమి లక్షణాలు ఎలా ఉన్నాయి.? లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అలాగే రాత్రిపూట ఎంతసేపు పడుకుంటున్నారు.? అనే విషయాలను పరిశీలించి ఈ విషయాలను వెల్లడించారు. వారానికి కనీసం రెండు, అంతకన్నా ఎక్కువసార్లు వ్యాయామం చేసేవారిని చురుకుగా ఉన్నవారిగా పరిగణనలోకి తీసుకుని వారి నిద్రకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. ఇలాంటి వారిలో నిద్రలేమి ముప్పు 42శాతం తక్కువగా ఉంటోందని గుర్తించారు. అలాగే వీరిలో నిద్రలేమి లక్షణాలు 22-40శాతం వరకు తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది.

Spread the love