మాన్‌సూన్‌ రెగట్టాలో

– ధరణి, మల్లేష్‌, దీక్షితకు స్వర్ణాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం ముగిసిన మాన్‌సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలర్లు లావేటి ధరణి, వడ్ల మహేశ్‌, కొమరవెల్లి దీక్షిత బంగారు పతకాలు సొంతం చేసుకున్నారు. అండర్‌ 19 ఇంటర్నేషనల్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ విభాగంలో లావేటి ధరణి – వడ్ల మల్లేష్‌ 17 పాయింట్లతో అగ్రస్థానంతో జాతీయ ఛాంపియన్‌గా నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన నాన్సీరారు-అనిరాజ్‌, విద్యాన్షి-మనీష్‌ జంటలు రజతం, కాంస్యం గెలిచాయి. అండర్‌-15 ఆప్టిమిస్ట్‌ బాలికల విభాగంలో దీక్షిత 12 రేసుల తర్వాత 57 పాయింట్లతో స్వర్ణం సొంతం చేసుకుంది. షగున్‌ ఝా (మధ్యప్రదేశ్‌) రజతం, ఆర్తి వర్మ (సీఈఎస్‌సీ మహారాష్ట్ర) కాంస్యం గెలిచారు. బాలుర విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఏకలవ్య బాతం చాంపియన్‌గా నిలవగా, ఎన్‌బిఎస్‌సి గోవాకు చెందిన శరణ్య జాదవ్‌, అజరు గజ్జి వరుసగా రజతం, కాంస్యం సాధించారు. ఈ టోర్నీలో తెలంగాణ సెయిలర్లు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సొంతం చేసుకున్నారు.

Spread the love