ఫ్రాన్స్ లోనూ భారత యూపీఐ సేవలు

నవతెలంగాణ – ఫ్రాన్స్: ఫ్రాన్స్ వెళ్లే భారత పర్యాటకులకు శుభవార్త. మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూపీఐ సేవలను ఫ్రాన్స్‌లో కూడా వినియోగించుకునే అవకాశం వారికి లభించనుంది. ఇకపై భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా ఫ్రాన్స్‌ లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. ఫ్రాన్స్‌ లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ వివరాలను వెల్లడించారు. భారత దేశ యూపీఐ మార్కెట్ విస్తరణకు గొప్ప ఊపు వచ్చిందని చెప్పారు. ఫ్రాన్స్ లో యూపీఐ సేవల సదుపాయం ఈఫిల్ టవర్ నుంచి ప్రారంభమవుతుందన్నారు.

Spread the love