2024లో భారత వృద్థి 6.7 శాతం

– ఐక్యరాజ్య సమితి అంచనా
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత వృద్థి రేటు 6.7 శాతంగా ఉండొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశీయ డిమాండ్‌ జీడీపీకి ప్రధాన మద్దతును అందించనుందని విశ్లేషించింది. 2023 మధ్యస్థానికి సంబంధించిన ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనా రిపో ర్ట్‌ను విడుదల చేసింది. 2023లో 5.8 శాతం వృద్థి ఉండొచ్చని అంచనా వేసింది. అధిక వడ్డీ రేట్లు, విదేశీ డిమాండ్‌లో తగ్గుదల ఉన్నప్పటికీ 2023లో పెట్టుబడులు, ఎగుమతులు మెరుగ్గానే ఉండొచ్చని పేర్కొంది. భారత ద్రవ్యోల్బణం సూచీ 5.5 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది.

Spread the love