ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ 425 శాతం డివిడెండ్‌

న్యూఢిల్లీ : ప్రముఖ గృహ రుణాల జారీ సంస్థ ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 2022-23 ఆర్థిక సంవత్స రానికి గాను ప్రతీ రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై ఏకం గా రూ. 8.50 లేదా 425 శాతం డివి డెండ్‌ను ప్రకటించింది. దీనికి సంస్థ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలి పారు. వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో అనుమతి లభించాల్సి ఉంటుంది. 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆ సంస్థ లాభాలు 5.5 శాతం పెరిగి రూ.1,180.3 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,118.6 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.5,299 కోట్లుగా ఉన్న సంస్థ రెవెన్యూ.. క్రితం త్రైమాసికంలో 20.83 శాతం వృద్థితో రూ.6,415.17 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. 2023 మార్చి 31 నాటికి ఎల్‌ఐసి హైసింగ్‌ పైనాన్స్‌ నికర విలువ రూ.24,674.98 లక్షల కోట్లకు చేరింది. సంస్థ స్థూల నిరర్థక ఆస్తులు 4.41 శాతంగా, నికర ఎన్‌పీఏలు 2.50 శాతంగా నమోద య్యాయి. బుధవారం బీఎస్‌ఈలో ఈ సంస్థ షేర్‌ 6.37 శాతం తగ్గి రూ.369.60 వద్ద ముగిసింది.

Spread the love