IPL క్వాలిఫయర్-2.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ లో వర్షం కురువడంతో టాస్ ఆలస్యంగా వేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఎల్లుండి (మే 28) ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొంటుంది.