జక్రాన్ పల్లి మండల జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ

– మస్టర్ల మీద సంతకాలు చేయని పంచాయతీ కార్యదర్శులు 
– ఉపాధి హామీ ఫీల్డ్ కురాని పంచాయతీ 
– గత సంవత్సరం వేల మొక్కలు నాటిన కనిపించకపోవడంతో మళ్లీ నాటాలి 
– ఆదివారం కూలీలకు మాస్టర్లు అటెండెన్స్ 
– జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ పెద్ద ప్రోగ్రాం కి గొప్పవారు ఉపాధి హామీ కూలీలే డి ఆర్ డి ఓ పి డ సాయ గౌడ్
నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల జాతీయ ఉపాధి హామీ 15వ సామాజిక తనిఖీ డిఆర్డిఓ పిడి సాయగౌడ అధ్యక్షతన నిర్వహించారు. మండలంలోని 21 గ్రామపంచాయతీలో సామాజిక తనిఖీ నిర్వహించి, ఆయా గ్రామపంచాయతీలో గ్రామసభలు నిర్వహించ వలసి ఉండగా, ఎలక్షన్ కోడ్ ఉండడంతో గ్రామస్థాయిలో ఇన్ హౌస్ గ్రామసభ నిర్వహించారు. శుక్రవారం మండల స్థాయిలో గ్రామపంచాయతీ వారిగా చేపట్టిన సామాజిక తనిఖీ వివరాలను రిసోర్స్ పర్సన్స్ చదివి వినిపించారు. రిసోర్స్ పర్సన్స్ కేశ పల్లి గ్రామపంచాయతీలో వివరాలు చదివి వినిపించా పరు,  44 లక్షల 96,000 99 రూపాయల పనులు చేయడం జరిగిందని అన్నారు. సామాజిక తనిఖీలు భాగంగా కేసుపల్లి గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీధర్ తనకి చేసే స్థలానికి రాలేదని రిసోర్స్ ఫంక్షన్స్ తెలిపారు. ఒకరోజు మాత్రమే వచ్చి ఫోటో దిగి వెళ్లిపోయారని తెలియజేశారు. హార్టికల్చర్ రికార్డులో మొక్కలు 117 ఉండగా ఇప్పుడు పరిశీలిస్తే 112 మొక్కలే కనిపించాయని ఇంకా ఐదు మొక్కలు కల్పించడం లేదని ఐదు మొక్కలు రిప్లేస్మెంటు చేస్తామని ఉపాధి హామీ సిబ్బంది తెలియజేశారని తెలిపారు. 43 లక్షల రూపాయలు మస్టర్ల పైన గ్రామపంచాయతీ సెక్రెటరీ సంతకాలు చేయవలసి ఉండగా నిర్లక్ష్యంతో సంతకాలు చేయలేదని రిసోర్స్ పర్సన్ తో తెలిపారు. మాస్టర్ల పైన సెక్రెటరీ సంతకాలు లేకుండానే 43 లక్షల రూపాయలు ఉపాధి కూలీలకు పేమెంట్ చేయడం జరిగిందని తెలియజేశారు.
ఈ విషయానికి స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్ స్పందిస్తూ ప్రతి గ్రామ పంచయతీ సెక్రెటరీ సంతకాలు చేయాలని తెలిపారు. లేనిపక్షంలో మేము జారీ చేయవలసి ఉంటుందని అన్నారు. నర్సరీ పనుల రిజిస్టరు నిర్వహించడం లేదని రిసోర్స్ పర్సన్స్ తెలిపారు. సోమవారం చేసిన పనికి ఆదివారం మాస్టర్లో హాజరు వేసి 6500 కూలీలకు పేమెంటు చేయడం జరిగిందని రిసోర్స్ పర్సన్ తెలిపారు. కేశపెల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ఐదు రోజులు పని చేస్తే నాలుగు రోజుల హాజరు వేయడంతో ఒకరోజు కూలి ఒక వంద 65 రూపాయలు నష్టపోయారని, అదే గ్రామానికి చెందిన రాజేష్ నాలుగు రోజులు పని చేస్తే ఐదు రోజులు పని చేసినట్లు డబ్బులు చెల్లించాలని రిసోర్స్ పర్సన్స్ తెలిపారు. జక్రం పెళ్లి గ్రామంలో ముగ్గురు కూలీలకు హాజరు వద్ద వైట్నర్ పెట్టి నాలుగు వేల రూపాయల కూలి చెల్లించారని తెలిపారు. జక్రాం పల్లిలో మాస్టర్లో హాజరు లేకున్నా కూలీలకు 3975 రూపాయలు పేమెంట్ చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా మాస్టర్లో కూలీల సంతకాలు లేకుండా 325 పేమెంట్ చేయడం జరిగింది అని తెలియజేశారు. అవిన్యూ ప్లాంటేషన్లో 2100 మొక్కలు ఉండగా కొత్త రోడ్డు పనులు జరగడంతో 670 మొక్కలు కనిపించడం లేదని తెలిపారు. ఎంపీడీవో ఏపీఓ సంతకాలు లేకుండా 70 వేల 960 రూపాయలు పేమెంట్ చేయడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా అర్హులు గ్రామపంచాయతీలో మస్టర్లపై పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండా 32 లక్షల 75 వేల రూపాయలు కూలీలకు చెల్లించడం జరిగిందని తెలిపారు.
మాస్టర్లో కూలీల సంతకాలు లేకుండా పేమెంట్ చేశారని పేర్కొన్నారు. తనిఖీ అనంతరం డి ఆర్ డి ఓ పి డి సాయగౌడు మాట్లాడుతూ మండలం మొత్తంలో ఐదు కోట్ల 44 లక్షల వరకు చేయడం జరిగిందని అన్నారు. మండలం మొత్తంలో చిన్న చిన్న ఇష్యులు ఉన్నాయని, పంచాయతీ కార్యదర్శులు ప్రతి మాస్టర్ పైన సంతకాలు చేయాలని తెలియజేశారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు వై ఆర్ ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. త్రాగునీరు సౌకర్యం షెడ్డు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి సంవత్సరం రోజ్గార్ దివాస్ నిర్వహించాలని తెలిపారు. ఉపాధి హామీ కూలీలు చేసిన పనిలో మెటీరియల్ కాంపౌండ్ ఎందుకు రాబోవు రోజుల్లో గ్రామ సంఘం భవనాలు గ్రామపంచాయతీ భవనాలు నిర్మించడం జరుగుతుందని అన్నారు. సోషల్ ఆడిట్ అనేది సిస్టం డెవలప్మెంట్ చేసుకోవడం అని అన్నారు. ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడానికి కారణము ఎవరని అడగగా, ఫీల్డ్ అసిస్టెంట్లు లేసి ఫీల్డ్ అసిస్టెంట్లీ కారణమని తెలిపారు, కాదని డిఆర్డిఓ పిడి తెలియజేస్తూ జాతీయ ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలే అందరికంటే గొప్పవాడని తెలిపారు. కూలికి ఎంత వేతనం ఇస్తున్నాము జాతీయ ఉపాధి హామీ లో పనిచేస్తున్న మనం ఎంత వేతనం తీసుకుంటున్నాము మరి ఈరోజు కూలి పని చేస్తేనే జాతీయ ఉపాధి హామీ కొనసాగుతుందని గుర్తు చేశారు. కాబట్టి ఇకనుంచి ఉపాధి హామీ కూలి కోసమే పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్ కుమార్, డి వివో నారాయణ, సేటు ప్రోగ్రాం ఆఫీసర్ అశోక్, రిసోర్స్ పర్సన్ పాండురంగ, ఏపీవో రవి, టెక్నికల్ అసిస్టెంట్లు , ఫీల్డ్ అసిస్టెంట్లు మెట్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love