కేరళ ప్రభుత్వ స్కూల్‌లో చేరిన మణిపూర్‌ చిన్నారి జెజెమ్‌

– ఆమె ఇప్పుడు కేరళ కుమార్తె
– ప్రేమగల స్నేహితులు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉంది
– ఆమె ముఖం నుంచి హింస, భయం నెమ్మదిగా మసకబారుతున్నాయి
– మణిపూర్‌ హింసలో జెజెమ్‌ ఇల్లు దహనం
– బంధువుతో కేరళకు చేరుకున్న చిన్నారి
– అన్ని విధాలా ఆదుకుంటాం: విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మణిపూర్‌లోని హింసాత్మక ప్రాంతానికి చెందిన బాలిక కేరళ ప్రభుత్వ పాఠశాలలో చేరింది. హౌనీ జెమ్‌ వైఫే ముద్దుగా ‘జెజెమ్‌’ అని పిలిచే విద్యార్థిని తిరువనంతపురం థైకాడ్‌ గవర్నమెంట్‌ మోడల్‌ ఎల్‌పీ స్కూల్‌లో రెండో తరగతి లో అడ్మిషన్‌ పొందింది. పాఠశాలలో సందర్శించిన విద్యాశాఖ మంత్రి వి. శివన్‌ కుట్టి, జెజెమ్‌ ను కలిశారు. ఆమెకు అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. ప్రశాం తంగా జీవించడానికి, చదువుకోవడానికి కేరళ మంచి ప్రాంతమని, తదుపరి చదువులకు అన్ని విధాల సహకారం అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. అక్కడ కొనసాగుతున్న హింసాకాండలో మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలోని నకుజుంగ్‌ గ్రామంలో జెజెమ్‌ ఇల్లు దహనమైంది. ఈ ప్రాంతంలో మైయితీ ప్రజ ల ఆధిపత్యం ఉంది. మాంగ్‌డోరు, అచోరుల రెండో కుమార్తెగా జెజెమ్‌ జన్మిం చింది. తన కుటుంబం దీనస్థితిని గుర్తించిన జెజెమ్‌ను తిరువ నంతపురంలోని కవడియార్‌లో ఆదాయపు పన్ను కార్యాలయంలో పనిచేస్తున్న ఆమె బంధువు లుంబి చియాంగ్‌ కేరళకు తీసుకొచ్చారు. అదే గ్రామానికి చెందిన లుంబి చియా ంగ్‌ కూడా అల్లర్లలో తన ఇంటిని కోల్పోయారు. సిందా కడంగ్‌బండ్‌లోని ఒక పాఠశాలలో ఆ చిన్నారి జెజెమ్‌ తన చదువును మధ్యలోనే నిలిపివేయవలసి వచ్చి ంది. ఇప్పుడు జెజెమ్‌ కేరళలోని తిరువనంతపురం థైకాడ్‌ గవర్నమెంట్‌ మోడల్‌ ఎల్‌పి స్కూల్‌లో రెండో తరగతిలో చేరింది. జెజెమ్‌ పట్ల ఆమె క్లాస్‌-ఇన్‌చార్జి టీచర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జెజెమ్‌ సంతోషంగా ఉంది. కేరళ రాజధాని నగరంలోని ఆమె కొత్త పాఠశాలలో ఆమె చుట్టూ ప్రేమగల స్నేహి తులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఆమె ముఖం నుంచి హింస, భయం నెమ్మదిగా మసకబారుతున్నాయి. ఆమె క్లాస్‌లో ముందు బెంచ్‌లో కూర్చుంటున్నారు. జెజెమ్‌ ఇప్పటి నుండి ‘కేరళ కుమార్తె’ అని అక్కడి వారు భావిస్తున్నారు.
జెజెమ్‌ కేరళ అందిస్తున్న భద్రతా భావాన్ని తెలిపింద్ణి వి.శివన్‌ కుట్టి
”మణిపూర్‌ నుంచి వచ్చి తిరువనంతపురంలోని తైక్కాడ్‌ మోడల్‌ గవర్న మెంట్‌ ఎల్‌పీ స్కూల్‌లో రెండో తరగతిలో ప్రవేశం పొందినహౌనీజెమ్‌ వైఫే (జెజెమ్‌)ను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు, ఆమె కేరళ కల్పిస్తున్న భద్రతా భావా న్ని తెలియజేసింది. అశాంతి ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు లేకుండా తన బంధువుతో కలిసి కేరళకు రైలు ఎక్కినప్పుడు ఆ చిన్నారి హృదయంలో ఏమని భావించి ఉండాలి? డియర్‌ జెజెమ్‌, కేరళ ప్రశాంతంగా జీవించడానికి, చదువుకోవడానికి మంచి ప్రదేశం. తదుపరి చదువుల కోసం అన్ని సహాయాలు అందిస్తాం” అని రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ మంత్రి వి.శివన్‌ కుట్టి తెలిపారు.

Spread the love