కేరళ ‘మధ్యాహ్న భోజనం’పై కేంద్రం రంధ్రాన్వేషణ

న్యూఢిల్లీ: కేరళలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వంపై సమయం దొరికిన ప్రతి సంద ర్భంలోనూ విషం చిమ్మడం కేంద్రానికి అలవాటుగా మారింది. కేరళ ప్రభు త్వం చెబుతున్న వాస్తవాలు బీజేపీ నాయకత్వానికి ఎంత మాత్రం రుచించడం లేదు. ప్రతి విషయంలోనూ తలదూర్చుతూ రంధ్రాన్వేషణ చేయడమే పనిగా పెట్టు కుంది. 2022-23లో రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యా ర్థులలో 99 శాతం మందికి మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించామంటూ కేరళ ప్రభుత్వం చెబుతున్న వాస్తవాలను కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కేంద్ర విద్యా శాఖ, కేరళ ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు. పీఎం పోష ణ్‌ యోజనకు సంబంధించి మంగళవారం కార్యక్రమాల పీఏబీ జరిపిన సమా వేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలోని 99 శాతం మంది విద్యా ర్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నామంటూ కేరళ ప్రభుత్వం చేసిన ‘అసంభవమైన’ ప్రకటనను పరిశీలిం చాలని కేంద్రం నిర్ణయించిందని విద్యా శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను సరిచూసుకునేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు కొన్ని జిల్లాలలో పర్యటించాలని పీఏబీ సమా వేశంలో నిర్ణయించారు. ఈ కమిటీ పాఠశాలలు, బ్లాకులు, జిల్లాలు… ఇలా వివిధ స్థాయిల నుండి గతంలో వచ్చిన సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తుంది.
ప్రతి పని దినంలోనూ పాఠశాలకు వచ్చే విద్యా ర్థులు, మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల సంఖ్య, ఇతర వివరాలను కచ్చితత్వంతో నమోదు చేయాలని రాష్ట్రానికి పీఏబీ సూచించింది.

Spread the love