కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ కొట్టివేత..!

నవతెలంగాణ – ఢిల్లీ: కేజ్రీవాల్‌ బెయిల్ పిటిషన్ ని కొట్టేసారు. ఇక వివరాల లోకి వెళితే, జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భద్రతను దృష్టి లో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్‌ ని హైకోర్టు కొట్టి వేసింది. పిల్ వేసిన న్యాయ విద్యార్థి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.75వేల ఫైన్ వేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండారింగ్ కేసు లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిన సమన్లు ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్ ని హైకోర్టు తిరస్కరించింది. పైగా జరిమానా ని కూడా ఇలా విధించింది. అన్ని క్రిమినల్ కేసుల్లో ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారించింది. కోర్టు పిటిషన్ ని తిరస్కరించి, రూ.75 వేల రూపాయల జరిమానా విధించారు.

Spread the love