కోహ్లీ ఎమోషనల్‌ పోస్ట్‌..

న్యూఢిల్లీ : ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైంది. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్‌ చేతిలో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్‌ చేశాడు. ‘ఈ సీజన్‌లో మెరుగ్గా ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తూ మనం లక్యానికి కొద్ది దూరంలో నిలిచి పోయాం. నిరాశ చెందినప్పటికీ.. మనం ఎప్పుడూ తలెత్తు కునే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు అడుగడుగునా అండగా నిలిచిన అభిమానులకు రుణపడి ఉంటాం.
మా కోచ్‌లు, మేనేజ్‌మెంట్‌, మా జట్టు సభ్యులకు కృతజ్ఞతలు. మరింత బలంగా తిరిగొస్తాం” అని కోహ్లీ రాసుకొచ్చాడు. థాంక్యూ బెంగళూరు అంటూ ఫొటోలు షేర్‌ చేశాడు.

Spread the love