క్షత్రియ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

నవతెలంగాణ- ఆర్మూర్
మండలంలోని  క్షత్రియ పాఠశాల చేపూర్ నందు నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బుధవారం క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి కరెస్పాండంట్ అల్జాపూర్ దేవేందర్, కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కార్యక్రమంలో శ్రీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ . గీత సారాంశం తో ప్రపంచానికి అంతులేని విజ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ప్రపంచానికి అందించినాడని అన్నారు. శ్రీ అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ శ్రీ కృష్ణ భగవానుడు చేరసాలలో జన్మించి, గోకులంలో పెరిగి పెద్దవాడై ద్వారకలో రాజనీతిని ప్రదర్శించినాడని అన్నారు. ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మాట్లాడుతూ శ్రీ కృష్ణుడు ఏప్పుడు ధర్మం వైపే ఉన్నాడని సృష్టిలో ఏ కార్యం ఎలా జరగాలో అలాగే జరిపించినాడని,యుద్ధం చేయను అని అన్న అర్జునుడికి గీతోపదేశం చేసి ధర్మాన్ని గెలిపించినాడని తెలిపారు. ఈ సందర్భంగా బాల బాలికల శ్రీ కృష్ణుని, గోపికల వేశాధారణ  మరియు చిన్నపిల్లలు ఉట్టి కొట్టె కార్యక్రమం చూపురలను ఎంతోగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అల్జాపూర్ జయంత్, అక్షయ్, పరీక్షిత్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love