కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యం

తప్పుడు ప్రచారంతో విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్న కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం దేవాదాయ శాఖకు 15 ఏండ్లుగా నామమాత్రపు అద్దె చెల్లిస్తున్న పాఠశాల మున్సిపల్‌, దేవాదాయ శాఖ అనుమతులు లేకుండానే పాఠశాల భవన నిర్మాణాలు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
నవతెలంగాణ-తాండూరు
దేవాదాయశాఖ అధికారుల నిర్లక్ష్యం పాలకవ ర్గం అలసత్వం కారణంగా ఆలయ ఆదాయానికి కో ట్లలో నష్టం వాటిల్లుతుంది. నామమాత్రపు అద్దెల తో తాండూరు పట్టణ కేంద్రంలో ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు పొట్లి మహారాజ్‌ దేవస్థానం ఆలయ ఆదా యానికి నష్టం వాటిల్లుతున్న సంబంధితశాఖ అధి కారులు నోరు మెదపకపోవడంతో పలు అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి. పొట్టి మహారాజ్‌ దేవ స్థానం ఆలయ ఆస్తులను అనుభవిస్తూ కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల యాజమాన్యం కోట్లు ఘటిస్తు న్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కృష్ణవేణి కాన్సె ప్ట్‌ పాఠశాల లీజును దేవాదాయశాఖ నుండి పొడి గించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టణ కేంద్రంలోని ఎకరా 20 గుంటల భూమిలో కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల ప్రభుత్వ నిబంధన లకు విరుద్ధంగా యథేచ్ఛగా కొనసాగిస్తూ ఉన్నారు. ము న్సిపల్‌ దేవాదాయశాఖ అనుమతులు లేకుండా నే భవనాలు నిర్మాణం చేశారు. కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠ శాల విద్య ముసుగులో విద్యార్థులను తల్లిదండ్రులు తప్పుడు పాంప్లెట్ల ప్రచారంతో ఆర్భాటం చేస్తుంది. 93 శాతం ఉత్తీర్ణత సాధించినప్పటికీ విద్యార్థులను తమపాఠశాలలో పదో తరగతి ఫలితాలలో 100 శా తం ఉత్తీర్ణత సాధించిందంటూ తల్లిదండ్రులను మో సానికి గురి చేసేలా పాఠశాల పేరుతో పాంప్లెంట్ల పై 100 శాతం ఉత్తీర్ణతంటూ ముద్రించుకొని ఆర్భా టంగా ప్రచారం చేసుకుంటున్నారు. డబ్బులు సం పాదించడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేస్తూ త ల్లిదండ్రులకు విద్యార్థులకు తీరని మోసం చేస్తున్నా రని పలువురు పేర్కొంటున్నారు. పట్టణంలో కృష్ణవే ణి కాన్సెప్ట్‌ పాఠశాలలో పదవ తరగతిలో 57 మం ది విద్యార్థులు ఉండగా 53 మంది విద్యార్థులు ఉత్తీ ర్ణత సాధించగా నలుగురు విద్యార్థులు ఫెయిల య్యారు. ఈ రిజల్ట్‌ చూస్తే 93 శాతం ఉత్తీర్ణత సా ధించినట్లు అవుతుంది. కానీ సదరు పాఠశాల యా జమాన్యం 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాం ప్లట్లు వేసి ప్రచార ఆర్భాటం చేస్తూ విద్యార్థుల తల్లి దండ్రులను మోసం చేస్తున్నారని పలువుర్శిస్తునరు. ఇలా విద్యార్థుల తల్లి దండ్రులను మో సానికి గురి చేసే పాఠశాలలపై ఉన్నత విద్యాధికారులు ప్రత్యేకం గా దష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని వి ద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. తప్పుడు పత్రాలతో విద్యాశాఖ ఆర్జేడి నుండి అనుమతులు పొందినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. తాండూర్‌ పట్టణ కేంద్రంలోని సాయిపూర్‌లోని సర్వే నంబర్‌ 95లో 7 ప్లాట్‌లో పాఠశాలకు గ్రౌండ్‌ ఉన్నట్లు లీజ్‌ డీడ్‌ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. దేవాలయ స్థలం లో అక్రమంగా పాఠశాలలు నిర్మించి రాజకీయ ఆర్థి క బలంతో దేవాలయ సొత్తును పాఠశాల నిర్వాహ కులు జేబులు నింపుకుంటున్నారని విమర్శలు విని పిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధితశాఖ అధికారు లు స్పందించి దేవాలయ ఆదాయాన్ని పెంచేందుకు తగుచర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.
దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం అద్దె చెల్లించే విధంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులకు సిఫారసు చేశాం
పొట్లి మహారాజ్‌ దేవాలయం ఆవరణలో నిర్మించిన కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌ కేవలం నెలకు రూ.8500 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాల వాడుకుంటున్న స్థలానికి రూ.1,50, 000 లకు పైగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అద్దెలు పెంచే విధంగాచర్యలు తీసుకునేందుకు ఉన్నతాధి కారులకు సిఫారసు చేసాం.
పొట్లి మారాజ్‌ దేవాలయ ఆలయ ఈవో నరేందర్‌
తప్పుడు ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల పదవ తరగతి రిజల్ట్‌లలో తప్పుడు ప్రచారంపై విద్యాశాఖ అధికారి ఎంఈఓ వెంకటయ్య గౌడ్‌ వివరణ కోరగా అలాంటి తప్పుడు ప్రచారం నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. కృష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాలలో 57 మంది విద్యార్థు లకు 53 మంది విద్యార్థులు పదవ తరగతిలో పాస్‌ అయ్యారు.
మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌

Spread the love