ఈ సమ్మర్‌లో నవ్వుల వర్షం ఖాయం

ఈ సమ్మర్‌లో నవ్వుల వర్షం ఖాయంఅల్లరి నరేష్‌ నటిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను నాని లాంచ్‌ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,”ఆ ఒక్కటీ అడక్కు’.. నరేష్‌ నాన్న ఈవీవీ డైరెక్ట్‌ చేసిన టైటిల్‌ వాడటం వలన స్పెషల్‌ కనెక్షన్‌ ఉందని అనుకుంటున్నాను. నరేష్‌ అద్భుతమైన నటుడు. తను బ్యాక్‌ టు బ్యాక్‌ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్‌ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఈ ట్రైలర్‌ చూస్తుంటే ఈ బ్రేక్‌లో తన కామెడీ మిస్‌ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్‌ అందరూ రిలేట్‌ అయ్యేలా వుంది. అందరూ హాయిగా ఎంజారు చేసే సినిమా అని ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది. ట్రైలర్‌ని చాలా ఎంజారు చేశాను. మే 3న నరేష్‌తో కలసి సినిమాని ఎంజారు చేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు. ‘అందరం కలసి కష్టపడి, ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తాను’ అని హీరో అల్లరి నరేష్‌ చెప్పారు. ‘ఇందులో సిద్ధి పాత్రలో నటించా. ఈ పాత్ర తప్పకుండా మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని ఆశిస్తున్నా’ అని హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా అన్నారు. నిర్మాత రాజీవ్‌ చిలక మాట్లాడుతూ,’ఈ సినిమాని దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారు’ అని అన్నారు.

Spread the love