భూమిని ర‌క్షించుకుందాం

మనిషికి ప్రకతికి అవినావ భావ సంబంధం ఉంది. ప్రకతి లేనిదే మానవ మనుగడ లేదు. అటువంటింది నేడు మనం ప్రకతిని అనేకరకాలుగా ధ్వంసం చేస్తున్నాం. అందుకే పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పించడం కోసం ఏప్రిల్‌ 22న ధరిత్రి దినోత్సవంగా జరుపు కుంటున్నాం.
మొట్ట మొదట ఐక్యరాజ్య సమితి1969 మార్చి నెలలో జాన్‌ మొక్కలతో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయ వేత్త గేలార్డ్‌ నెల్సన్‌ ప్రారంభించాడు. 1962లో సెనేటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతి రూపమే ఈ ధరిత్రి దినోత్సవం.
పర్యావరణానికి హాని కలిగించే, గ్రహ వినాశనానికి దారితీసే కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌, అటవీ నిర్మూలన వంటి వివిధ సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ రోజున అవగాహనా కార్యక్రమాలు చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం గురించి అవగాహన కల్పిస్తారు.
ప్రకతి ఎంత సహజంగా, అందంగా పక్షులు, చెట్లు, జంతువులు తదితరాలతో ఉంటుంది. మనిషి స్వార్ధ పరుడు. చెట్లను కొట్టేసి పక్షులకు గూళ్ళు లేకుండా, జంతువులకు నీడ లేకుండా చేసాడు. ప్రగతి పేరుతో ఫ్యాక్టరీలు పెట్టి అడ్డు, అదుపు లేకుండా ప్రకతి వనరుల్ని దోచేశాడు. స్వచ్ఛమైన గాలి గుండెలనిండా పీల్చుకునే భాగ్యాన్ని లేకుండా చేసాడు.
అపరిశుభ్రమైన పరిసరాలు, ఆరోగ్య సమస్యల కారణంగా రోజురోజుకు దారిద్య్రం పెరిగిపోతోంది. ఉద్యోగ, ఉపాధి పనులను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస రావడం వలన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దెబ్బ తినడమే కాక సౌకర్యాల లేమితో పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరుగుతున్నాయి. వీటివల్ల పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి పనికి ఇంధన వనరులు అవసరం. వంట పనుల కోసం, యంత్రాల కోసం, వాహనాలు నడపడానికి, వ్యవసాయానికి, ఫ్యాక్టరీలు, గహాలలో, విద్యుత్‌ అవసరాల కోసం ఇలా ప్రతి పనికి ఇంధనం తప్పనిసరిగా అవసరం.
ఆధునికీకరణలో భాగంగా పరిశ్రమలు పెరగడంతో ఇంధన వనరులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ధర్మల్‌ విద్యుత్‌, జల విద్యుత్‌ తగినంతగా ఉత్పత్తి కావడం లేదు. పెరుగుతున్న జనాభా వల్ల వాడకం మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బొగ్గు, పెట్రోలియం, డీజిల్‌ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనికితోడు వీటి ఉత్పత్తి సమయంలో కాలుష్యం కూడా ఏర్పడుతుంది.
పరిశ్రమలు వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే ఇవి వీలైనంత కాలుష్యాన్ని ఘన, ద్రవ, వాయు, రూపంలో చుట్టూ పరిసరాల్లోకి వదులుతున్నాయి. ప్రతి పరిశ్రమ ముడి పదార్థాలను ప్రకతి నుండే తీసుకుంటుంది. ఉత్పత్తి క్రమంలో పరిశ్రమలు, వస్తువులతో పాటు కాలుష్యాన్ని కూడా పుట్టిస్తున్నాయి. ఈ వ్యర్థాలు కొన్ని నీటిలో కరిగి రసాయనిక మురికి నీరుగా, కొన్ని ఘన రూపంలోనే విష రసాయనాలుగా, మరికొన్ని రసాయనాలను కలియ పెట్టినప్పుడు విష వాయువులుగా పరిశ్రమల చుట్టూ కమ్ముకుంటున్నాయి.
అభివద్ధి అంటే వినాశనానికి దారి తీయరాదు. ప్లాస్టిక్‌ వాడకం కూడా పర్యావరణాన్ని ఎంతగానో దెబ్బ తీస్తోంది. ప్లాస్టిక్‌ బ్యాగుల స్థానంలో కాగితం, బట్టతో తయారు చేసిన సంచులు వాడేలా ప్రోత్సహించాలి. క్యారి బ్యాగులు అందుబాటులోకి రాకముందు ఏ విధంగా సరుకులు తెచ్చుకునేవారో అదే పద్ధతిని పాటించాల్సిందిగా ప్రచారం చేయాలి. పర్యావరణ కాలుష్యంలో నీటి కాలుష్యం ప్రధానమైంది. మనం బతకడానికి నీరు అవసరం. భూమి మీద మూడు వంతులు నీరు, ఒక వంతు భూ భాగం ఉన్న సంగతి తెలిసిందే. మూడు వంతుల నీళ్లు ఉన్నా మనకు ఉపయోగపడేది ఒక్క శాతం మాత్రమే.
చెరువులు, నదులు, భూ గర్భంలో ఉన్న నీరు తాగేందుకు ఉపయోగ పడుతున్నాయి. ఒకే ఒక్క భాగం వున్న నేలలో మనం మూడు వంతులు ఉన్న నీటిని కలుషితం చేస్తున్నాం. మంచి నీటితో పాటు కోట్ల జీవులకు ఆవాసమైన సముద్ర జలాలను కూడా మురికి చేస్తున్నాం.
పర్యావరణం పరిశుభ్రంగా, ప్రకతి పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా చెట్లను పెంచాలి. అలాగే పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంపై అవగాహన కల్పించాలి.
పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి. ప్రభుత్వ అధికారులు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి. ర్యాలీలు నిర్వహించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం కలిగించాలి. ఏది ఏమైనప్పటికీ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
వాహనాల వాడకం తగ్గిచటం, మొక్కలు పెంచటం, చెరువులను కాపాడుకోవడం వంటివి మానవుని చేతుల్లోనే ఉంది.
అందరికీ స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వటానికి మనవంతుగా ప్రయత్నించాలని, ధరిత్రి ప్రాముఖ్యతను ముందు తరాలవారికి తెలియచేస్తూ దానిని కాపాడుకోవడానికి చేయవలసిన కషి చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ….

– పాలపర్తి సంధ్యారాణి, 9247399272

Spread the love