ఎదురుచూపు

జీవితం రంగుల స్వప్నమై పోతోంది
గడిచిపోతునే ఉంది కాలం గతమై..
నేను చేసే పనులు నాతోనే ఉన్నారు స్థిరమై..
క్షణం కూడా వృథా చేయకూడదని
పరిగెత్తలానుకున్న నా ప్రతీ అడుగు
మూహుర్త సమాయన వెనక్కి చూస్తోంది..
గతం నేను కన్న కలల కంటే
ప్రస్తుతం నా ముందు ఉన్న ఊహాలే ఎక్కువ

ఏదో ఒక రోజు
ఏదో ఒకటి సాధిస్తానని తెలుసు
కానీ ఆ రోజు ఇప్పుడెందుకు కాకూడదని
నా మనస్సులో ప్రశ్న..
నేను ఎదురు చూసే గమ్యం కన్న
నన్ను తొంగి చూసే తగాదలే శానా..
నేనేప్పుడు అనుకుంటూ ఉంటాను
భయపడకుండా ఉండాలని..
కానీ ఆ భయమే నా గడప తలుపు తట్టి
తలుపు తెరువు తెరువుమని బెదిరిస్తూ
నేను రానన్నా
బయట గడపలో బంధీంచి
నన్ను ముందుకు సాగనీయడయం లేదు..

నేను ప్రస్తుతం అనుభవిస్తున్న..
అనుభవించాలని అనుకున్న జీవనానికి
ఏ మాత్రం పోంతన లేకుండా
నాలుగు గోడల మధ్య
హృదయాన్ని తట్టి లేపే
చినుకు లాంటి పిలుపు కోసం
ఎదురు చూస్తూ నిలబడ్డాను..
ఎప్పటి నుంచో తరముకొస్తున్న
చీకటిదారులు తొలగించుకుని
ఆకాశానికి దారి వేయలానుకుంటే
నా ఎదురుగా మంచు తెరపై
నిల్చున్న నా ప్రతిబింబం..
నీలం బమ్మై వెక్కిరిస్తోంది..

బయట పడే మార్గం చెప్పామంటే..
లోపాల ఉండకూడదు
అంటోంది చమత్కారంగా..
నీళ్లు ఉన్నంతా వరకే చెరువులో
కప్పలు ఎగురుతాయి కాదా
అనుకుంటూ తొందర తొందరగా
ఆలోచనాల ప్రమాణం మొదలు పెట్టాను..

రహదారుల్లా సాగిన ఊహలు ఉన్నాయి..
అలల్లా పొంగే ఆలోచనలు ఉన్నాయి…
కెరటాల్లా ఎగసిపడి ఆశలు ఉన్నాయి..
నేనున్నానని ఎదురొచ్చి స్వాగతం పలికే..
దైర్యం తప్పా….!
– అకూనమోని రచన

Spread the love