చంద్రగ్రహణం అపోహలు – వాస్తవాలు

Lunar Eclipse Myths - Factsసూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖ పైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సూర్య గ్రహణం అమావాస్య నాడు పగటిపూట ఏర్పడుతుంది. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూమి మీద గ్రహణాలు ఏర్పడడాన్ని సమ యంలో చిన్నమార్పులతో భూమిపై నుండి వీక్షిం చవచ్చు. అక్టోబర్‌ 28, 2023 శనివారం రాత్రి 1 గంట 5 నిమిషాల నుండి 2 గంటల 22 నిమిషాల వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇది మన ఇండియాతో పాటుగా ఆస్ట్రేలియా, యూరప్‌, ఉత్తర, దక్షిణాఫ్రికా, ఆసియా, అంటార్కిటికా ప్రాంతాల్లో కనబ డుతుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఏడు గ్రహణాలు ఏర్పడతాయి అందులో ఐదు సూర్య గ్రహణాలు ఉంటే రెండు చంద్రగ్రహణాలు లేదా నాలుగు సూర్య గ్రహణాలు ఉంటే మూడు చంద్రగ్రహణాలు సర్వసాధారణంగా ఏర్పడతాయి. ఇదే క్రమం ప్రతి పదేండ్లకు ఒకసారి తిరిగి పునరావృతం అవుతూ ఉంటుంది.
చంద్రగ్రహణం:
చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి వచ్చిన ప్పుడు సూర్యుడు నుండి వెలువడే కాంతి చంద్రుడిపై పడకుండా భూమిపై పడటం వల్ల భూమిపైన ఉన్న వారికి చంద్రుడు కనిపించరు దీన్నే చంద్రగ్రహణం (లూనార్‌ ఎక్లిప్స్‌) అని అంటారు. చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. చంద్ర గ్రహణ సమయంలో చంద్రుడు కొన్ని గంటల పాటు అర్థ గోళాకారంలో కనిపిస్తుంది. చంద్రుడు కొద్ది భాగం మాత్రమే భూమి నీడలోకి ప్రవేశించి నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు పూర్తి భాగం భూమి నీడలోకి ప్రవేశించి నప్పుడు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం ఏర్పడ్డ సమయంలో భూమిపైన మనకు చంద్రగ్రహణం ఏర్పడితే అదే సమయంలో గనక మనం చంద్రుడు పైనుండి చూస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం నాడు భూమిపై నుండి చూస్తే చంద్రుడు కనిపించడు సూర్యగ్రహణం నాడు భూమిపై నుండి చూస్తే సూర్యుడు కనిపిం చడు. సూర్యగ్రహణం ఏర్పడ్డ సమయంలో గ్రహ ణాన్ని నేరుగా కళ్ళతో వీక్షించ రాదు. సూర్యుడిపై నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలు నేరుగా మన కంటిపై పడి కంటిలోని సున్నిత రెటీనా దెబ్బతినే ప్రమాదం ఉంది. చంద్ర గ్రహణాన్ని మాత్రం నేరుగా మన కళ్ళతో చూడ వచ్చు ఎటువంటి హాని కలగదు, కళ్లకు ఎటువంటి ప్రమాదం కలగదు. చంద్రగ్రహనాన్ని క్షుణ్ణంగా చూడాలంటే మాత్రం దూరాన ఉన్న వస్తు వులు చూసే బైనాక్యులర్‌ సహాయంతో చూస్తే చంద్రగ్రహణం మరింత స్పష్టంగా కనబడుతుంది.
సూపర్‌ మూన్‌ :
భూమి నుండి చంద్రుడు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమి, చంద్రుడు మధ్య సరాసరి దూరం 3 లక్షల 84 వేల 440 కిలోమీటర్లు. భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు ఏర్పడే పౌర్ణమి నాటి చంద్రుడిని సూపర్‌ మూన్‌ అంటారు. అప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం 3 లక్షల 56వేల 509 కిలోమీటర్లు దూరం కొంత తగ్గుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు సాధారణ రోజుల కంటే 14 రేట్లు పెద్దగా 3 రేట్లు ప్రకాశవంతంగా కొత్త,కొత్త రంగులో కనిపించడం జరుగుతుంది. చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళినప్పుడు 4 లక్షల 6వేల 662 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
బ్లూ మూన్‌ :
ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే అలా వచ్చిన నెల చివరలో రెండవ పౌర్ణమి నాటి చంద్రుని బ్లూ మూన్‌ అని అంటారు. 30 నెలల కోసారి ఇలా ఒకే నెలలో రెండు పౌర్ణములు రావడం జరుగుతుంది.
బ్లడ్‌ మూన్‌ :
సూపర్‌ మూన్‌ సందర్భంగా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు సాధారణం కంటే ఆ రోజు చంద్రుడు ఎక్కువ ఎర్రగా కనపడటం వల్ల ఆరోజు కనబడే చంద్రుని బ్లడ్‌మూన్‌ అని అంటారు. సూర్య రష్మి సూర్యుడి నుండి వెలువడి భూమి వాతావరణంలోనికి వచ్చినప్పుడు రంగులు దేనికవి విడిపోతాయి అన్ని రంగుల్లో కెల్లా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు, నారింజ రంగులు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల చంద్రుడు ఎరుపు రంగులో కనిపించడం వల్ల దాన్ని బ్లడ్‌మూన్‌ అని అంటారు. గ్రహణ సమయంలో చంద్రుడు భూమి నీడలోకి వెళ్లడం వల్ల సూర్యుడు నుండి వచ్చే కాంతి భూమిపై పడి ఆ తరువాత చంద్రుడు పై పడుతుంది అందుకే ఆ రోజు చంద్రుడు సాధారణ రోజుల కంటే ఎర్రగా కనిపిస్తుంది.
వేల సంవత్సరాలుగా మన దేశంలో అన్ని మతాల్లో మరీ ముఖ్యంగా హిందూమతంలో గ్రహణ సందర్భంగా రకరకాల మూఢనమ్మకాలు సమాజం లో ఉన్నాయి. అక్టోబర్‌ 28, 2023 శనివారం రాత్రి ఏర్పడిన చంద్ర గ్రహణం అశ్విని నక్షత్ర నాలుగో పాదంలో కండిగాసమైన రాహు గ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సింహ లగం లో ఏర్పడుతుందని ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభము, మధ్య మము, అరిష్టము అని అరిష్టము ఉన్న వారు వెండి పాత్ర, వెండి పాము, బంగారము, వస్త్రము, గిన్నె, ధనము అన్నింటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని గర్భిణులు ఎట్టి పరిస్థితు ల్లోనూ బయటికి వెళ్ళకూడదని ఒకవేళ బయటికి వెళ్ళినట్లయితే గర్భం లో ఉన్న శిశువుపై గ్రహణ ప్రభా వం వల్ల గ్రహణ దోషంతో పిల్లలు పుడ తారని ప్రచారంలో ఉంది. గ్రహణ సమయంలో ఆహార పదార్థాల పైన గడ్డి (దర్భ) గరక వేసి ఉంచాలని గ్రహణం వల్ల వచ్చే అశుభం ఆహార పదార్థాలకు అంటదని చెప్పడం. కొడు కులు ఉన్నవారు ముఖ్యంగా వారి తల్లి పూజలు చేయాలని ఇంట్లో గ్యాస్‌స్టవ్‌ కింద పలానా రంగు వస్తువు పెట్టాలని ఇంట్లో ఒక ప్రాంతంలో నిమ్మకాయను ఉంచాలని గ్రహణ దోషం ఆరు నెలలపాటు ఉంటుందని రాహువు కేతువు చంద్రు డిని మింగుతుందని చిన్నప్పటి నుంచే పిల్లలకు చెప్పడం ముఖ్యంగా నేడు ఏర్పడుతున్న చంద్రగ్రహణం శీతాకాలం అయినా సమయంతో సంబంధం లేకుండా అర్ధరాత్రి చంద్రగ్రహణం అనంతరం చన్నీళ్ళతో స్నానం చేయాలని చెప్పడం అలా చేయకపోతే అరిష్ట మని ఇలా ఎన్నో రకాల మూఢనమ్మకాలు సమాజంలో నేటికీ చలామణిలో ఉన్నాయి. వాస్తవానికి ఇంత చలికాలంలో అర్ధరాత్రి స్నానం చేస్తే జలుబు, జ్వరం వస్తుంది తప్ప ఏమీ జరగదు.
ముఖ్యంగా గ్రహణ సమయంలో ఏమీ తినకూడదని మూఢ నమ్మకం బలంగా ఉంది. గ్రహణ సమయంలో ఆహారం సేకరించడం వల్ల ఎటువంటి నష్టము జరగదు. వేల సంవత్సరాలుగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను వదిలి శాస్త్రీయంగా ఆలోచించి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని శాస్త్రీయ సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుందాం. రేపటి తరమైన నేటి బాలబాలి కలకు, విద్యార్థిని విద్యార్థులకు ఆశాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించ కుండా శాస్త్రీయ భావజాలాన్ని పెంపొందించేలా కృషి చేద్దాం. మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం.శాస్త్రీయ సమసమాజాన్ని నిర్మిద్దాం.
చార్వాక జి
9347284111

Spread the love