ఎస్‌ఎఫ్‌ఐ 44వ జిల్లా మహాసభలు విజయవంతం చేయండి

నవతెలంగాణ-నల్లగొండడెస్క్‌
నల్లగొండ జిల్లా మహాసభలు సెప్టెంబర్‌ 2 3 4వ తేదీల్లో సాగర్‌ నియోజకవర్గం హాలియాలో నిర్వహించడం జరుగుతుందని ఎస్‌ఎఫ్‌ఐ 44వ జిల్లా మహాసభలు విజయవంతం చేయలని ఎస్‌ఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్‌ పిలుపునిచ్చారు. సోమవారం హాలియా పట్టణంలో ఆయన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చి తొమ్మిదిన్నర ఏండ్లవుతున్నా ఇప్పటివరకు విద్యారంగానికి ముందంజలో అడుగు వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. జిల్లాలో ఉన్న అనేక సమస్యలను విద్యాధికారులు, కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.జిల్లాలో ఆర్భాటంగా మొదలుపెట్టిన ఆదర్శ పాఠశాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందన్నారు సంక్షేమ హాస్టల్లో గురుకులాలు కస్తూర్బా గాంధీ పాఠశాలలో పక్కా భవనం నిర్మించడంలో ప్రభుత్వం ఆలస్యం వహించింది అన్నారు ఈ మహాసభలో గత మహాసభల నుంచి జిల్లాలో విద్యార్థి ఉద్యమ అంచనాను పరిశీలించి ఈ జిల్లాలో ఉన్న సమస్యలపై భవిష్యత్తు ఉద్యమాలకు కార్యచరణ రూపొందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమావత్‌ లక్ష్మణ్‌ నాయక్‌ గిరిజన సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్‌ నాయక్‌. ఐద్వ జిల్లా అధ్యక్షులు వరలక్ష్మి గారు మరియు జిల్లా నాయకులు కారంపూడి దినమ్మ గారు నల్లబెల్లి జగదీష్‌ కోరే రమేష్‌. అనుముల మండల అధ్యక్ష కార్యదర్శులు దోసపాడు నవీన్‌ ఆలేటి చందు, తిరుమలగిరి మండల అధ్యక్ష కార్యదర్శులు గోపీచంద్‌ రమావత్రంగా పెద్దవూర మండల అధ్యక్ష కార్యదర్శులు సురేష్‌ సాయికుమార్‌ కంపాటి. నిడమనూరు మండల అధ్యక్షుడు నగేష్‌ అనిల్‌ పాల్గొన్నారు.

Spread the love