రష్యా నల్లసముద్ర నౌకాదళం నావల్ బ్లాకేడ్ ను విధించటానికి విన్యాసాలను నిర్వహించింది. పౌర సేవలకు వినియోగించే అన్ని నౌకలు సైనిక సామాగ్రిని కలిగివున్నట్టుగానే భావిస్తామని రష్యా, ఉక్రెయిన్ ప్రకటించాక ఈ నౌకా విన్యాసాలు జరిగాయి. ఈ విన్యాసాలలో శత్రు నౌకలను ధ్వంసం చేయటంపైన ద్రుష్టిని సారించటం జరిగిందని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.
ఐక్యరాజ్య సమితి, టర్కీల చోరవతో చేసుకున్న ఉక్రెయిన్ రేవుల నుంచి ధ్యాన్యాన్ని ఎగుమతి చేసే ఒప్పందాన్ని పొడిగించటానికి సోమవారం నాడు రష్యా తిరస్కరించింది. ఆహార ధాన్యాలను, ఎరువులను రష్యా ఎగుమతి చేయటంపైన పశ్చిమ దేశాల ఆంక్షలను తొలగించేలా చేస్తామని ఇచ్చిన హామీని ఐక్యరాజ్య సమితి నిలబెట్టుకోలేక పోయిందని రష్యా ప్రకటించింది.
ఈ ఒప్పందం ప్రకారం రష్యా ఇచ్చిన అన్ని భధ్రతా హామీలను రద్దు చేసుకోవటం జరుగుతుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి నుంచి నల్ల సముద్రంలోని ఉక్రెయిన్ రేవులవైపు పయనించే అన్ని నౌకలు సైనిక సమాగ్రిని తీసుకుపోయేవిగాను, వాటి యాజమాన్య దేశాలు ఉక్రెయిన్ తరపున జోక్యం చేసుకుంటున్న దేశాలుగా భావించబడతాయి. ఉక్రెయిన్ కూడా గురువారంనాడు ఇటువంటి హెచ్చరికనే చేసింది. నల్ల సముద్రంలో రష్యావైపు పయనిస్తున్న నౌకలు ”డేంజర్ జోన్”లో ప్రవేశించినట్టేనని ఉక్రెయిన్ ప్రకటించింది.