క్రిమియా బ్రిడ్జిపైన ఉక్రెయిన్‌ దాడి

–  రెచ్చిపోయి ప్రతిదాడి చేస్తున్న రష్యా
సోమవారం రాత్రి ఉక్రెయిన్‌ వాటర్‌ డ్రోన్లను ఉపయోగించి రష్యను క్రైమియాతో కలుపుతున్న కెర్చ్‌ బ్రిడ్జ్‌ పైన దాడి చేసింది. పర్యవసానంగా బ్రిడ్జ్‌ పైన ఒకవైపు ట్రాపిక్‌ నిలిచిపోయింది. అంతేకాకుండా 28 మిలిటరీ డ్రోన్లతో క్రైమియాపై చేసిన దాడులను తిప్పికొట్టినట్టు రష్యా రక్షణ మత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇందుకు ప్రతీకారంగా తమ బ్రిడ్జ్‌ పైన దాడికి ఉపయోగించిన డ్రోన్ల ఒడిస్సా ప్రాంతంలోని తయారీ కేంద్రంపైన రష్యా హై ప్రిసిషన్‌ మిసైల్లతో దాడి చేసి నాశనం చేసింది. అంతేకాకుండా ఒడిస్సా, నికోలేవ్‌ ప్రాంతంలోవున్న చమురు నిల్వ కేంద్రాలను నౌకా ఆయుధాలను ఉపయోగించి ధ్వంసం చేసింది.
క్రైమియాను రష్యాతో కలుపుతున్న కెర్చ్‌ బ్రిడ్జ్‌ ని 2018లో రష్యా ప్రారంభించింది. ఈ బ్రిడ్జ్‌ పైన రోడ్డు, రైలు రవాణాకు సదుపాయం ఉంటుంది. 2014లో రష్యా క్రైమియాను స్వాధీనం చేసుకున్న తరువాత ఈ బ్రిడ్జ్‌ ని నిర్మించారు. సోమవారం సాయంత్రం టివీలో రష్యా అధ్యక్షుడు వ్లాడీమీర్‌ పుతిన్‌ మాట్లాడుతూ తమ బ్రిడ్జ్‌ మీద జరిగిన క్రూర టెర్రరిస్టు దాడికి రష్యా ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రకటించాడు. ఈ దాడిలో సమాంతరంగావున్న రైలు మార్గం దెబ్బతిన లేదు. రోడ్డు ఒకవైపు దెబ్బదిన్నది. కెర్చ్‌ బ్రిడ్జ్‌ పైన ఉక్రెయిన్‌ చేసిన దాడిలో కారులో ప్రయాణం చేస్తున్న దంపతులిరువురూ మరణించారని, వారి 14ఏళ్ళ కూతురు గాయపడిందని ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతంలోని పశ్చిమ రష్యా ప్రాంతమైన బెల్గోరాడ్‌ గవర్నర్‌ వ్యాచెస్లావ్‌ గ్లాడ్కోవ్‌ ఒక టెలిగ్రామ్‌ ప్రకటనలో పేర్కొన్నాడు. అమెరికా, బ్రిటన్‌ ల ప్రత్యక్ష ప్రమేయంతో ఈ దాడి జరిగిందని రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా ఆరోపించింది.
గత సంవత్సరంలో కూడా కెర్చ్‌ బ్రిడ్జ్‌ పైన పెద్ద ఎత్తున్న దాడి జరి గింది. ఆ దాడి తరువాత 2022 అక్టోబర్‌ లో ఈ బ్రిడ్జ్‌ ని ఒకవైపు మూసి వేశారు. ఆ తరువాత తిరిగి ఫిబ్రవరిలో కెర్చి బ్రిడ్జ్‌ని పూర్తిగా తెరిచారు.

Spread the love