– వరల్డ్ నం.7పై మెరుపు విజయం
– సింధు, శ్రీకాంత్, ప్రణరు ముందంజ
– ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్
సిడ్నీ (ఆస్ట్రేలియా) : భారత బ్యాడ్మింటన్‌లో ఎప్పుడూ వినిపించని, కనిపించని ఓ షట్లర్ సిడ్నీలో సంచలనం సృష్టించాడు. వరల్డ్ నం.7, నాల్గో సీడ్ కీన్ యే లోV్‌ా (సింగపూర్)పై కండ్లుచెదిరే విజయం నమోదు చేశాడు. వరల్డ్ నం.50 మిథున్ మంజునాథ్ 21-19, 21-19తో వరుస గేముల్లో సింగపూర్ షట్లర్‌ను చిత్తు చేశాడు. 41 నిమిషాల్లోనే లాంఛనం ముగించి మెన్స్ సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. యువ షట్లర్ లక్ష్యసేన్ గాయంతో పోటీ నుంచి తప్పుకున్నాడు. సహచర షట్లర్ కిరణ్ జార్జ్‌తో తొలి గేమ్‌లో 0-5తో ఉండగా లక్ష్యసేన్ వాకోవర్ ఇచ్చాడు. మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 21-18, 21-7తో వరుస గేముల్లో కెంటా నిషిమోట (జపాన్)పై గెలుపొందాడు. హెచ్.ఎస్ ప్రణరు సైతం మూడు గేముల మ్యాచ్‌లో గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌కు చేరాడు. 21-18, 16-21, 21-15తో లీ చెక్ యు (హాంగ్‌కాంగ్)పై ప్రణరు నెగ్గాడు. ప్రియాన్షు రజావత్ 21-12, 21-16తో ఆసీస్ షట్లర్ నాథన్ టాంగ్‌ను ఓడించాడు.
మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ పి.వి సింధు రెండో రౌండ్లోకి చేరుకుంది. సహచర షట్లర్ అష్మిత చాలిహపై 21-18, 21-13తో సింధు తొలి రౌండ్లో గెలుపొందింది. ఆకర్షి కశ్యప్ 21-15, 21-17తో మలేషియా అమ్మాయి జి వేపై విజయం సాధించింది. మాళవిక బాన్సోద్ 20-22, 11-21తో చైనీస్ తైసీ షట్లర్ చేతిలో ఓటమి చెందింది. నేడు ప్రీ క్వార్టర్స్‌లో పి.వి సింధు, ఆకర్షి కశ్యప్ ముఖాముఖి ఢకొీట్టనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్, సిక్కి రెడ్డి జంట 14-21, 18-21తో వరల్డ్ నం.5 జోడీ చేతిలో ఓటమిపాలైంది.