చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమం రద్దు

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు (ఏప్రిల్ 21) నిర్వహించాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దయింది. బాలాజీ ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించాలనుకున్న వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశామని ప్రధాన పూజారి రంగరాజన్ వెల్లడించారు. వివాహ ఘడియల కోసం ఎదురుచూస్తున్న వారు తమ ఇళ్లలోనే దైవ ప్రార్థన చేసుకోవాలని సూచించారు.  అయితే, ఆదివారం సాయంత్రం జరగాల్సిన కల్యాణత్సోవం షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని, ఆ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని రంగరాజన్ చెప్పారు. సంతాన భాగ్యం కోసం తాము అందిస్తున్న గరుడ ప్రసాదం పంపిణీలో నిన్న తలెత్తిన ఇబ్బందుల వల్లే వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

Spread the love