బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి జట్టు

న్యూఢిల్లీ : బజాజ్‌ ఫైనాన్స్‌తో మారుతి సుజుకి కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా సులభంగా మారుతి వినియోగదారుల ఆటో రిటైల్‌ ఫైనాన్సింగ్‌ పరిష్కారాలు లభించనున్నాయని తెలిపింది. కార్లను సొంతం చేసుకోవాలనే ఫైనాన్సింగ్‌ ప్రక్రియ సులభతరం కానుందని పేర్కొంది. ఈ ఒప్పందంలో బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుప్‌ సహా, మారుతి సుజుకి మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా పాల్గొన్నారు.

Spread the love