సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కసిరెడ్డి 

నవతెలంగాణ – ఆమనగల్ 
కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని‌ కలిశారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపినట్టు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట సురభి వెంకటేశ్వర రావు ఉన్నారు.
Spread the love