తాజ్ పూర్ గ్రామంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ..

నవతెలంగాణ -భువనగిరి రూరల్ 
భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో  దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని కురువ సంఘం నాయకులు, ఎమ్మెల్సీ యేగ్గే మల్లేష్, స్థానిక ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ యాదవ్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, గొర్రెల మేకల పెంపకం దారుల సహకార యూనియన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్  కంచర్ల రామకృష్ణారెడ్డి తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు యోగే మల్లేష్ మాట్లాడుతూ  తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం అని తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్మరణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని అన్నారు.అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేదనారు. దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడనీ, తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు అని దొడ్డి కొమురయ్య త్యాగాలను గుర్తు చేశారు. అయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాతనే సీఎం కేసీఆర్ దయవల్ల  బీసీ కులాలు ఎంతో అభివృద్ధి చెందిదనారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అకండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాజ్పూర్ గ్రామ ఉపసర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భువనగిరి, యాదగిరిగుట్ట జడ్పిటిసిలు సుబ్బురు బీరు మల్లయ్య, తోటకూర అనురాధ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, పిర్జదిగూడ కార్పొరేటర్ కౌడి పోచన్న, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, సర్పంచ్ బొమ్మరేపు సురేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, జక్క రాఘవేందర్ రెడ్డి, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనపురి కవిత రాములు, కురుమ సంఘం నాయకులు నర్సింహులు, డోకే బాలకృష్ణ, గొల్ల కురుమ సంఘం నాయకులు పుట్ట వీరేష్ యాదవ్, సురేష్ యాదవ్, జిఎంపిఎస్ నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా డైరెక్టర్ బండారు నరసింహ, జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ, జిల్లా నాయకులు ఉడుత బాలకృష్ణ, బుడమ శ్రీశైలం, కడం బీరప్ప, ఐలయ్య, పాక జహంగీర్ లు పాల్గొన్నారు.
Spread the love