Wednesday, June 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంస్కూల్‌ బస్సుల తనిఖీకి మొబైల్ స్వ్కాడ్లు

స్కూల్‌ బస్సుల తనిఖీకి మొబైల్ స్వ్కాడ్లు

- Advertisement -

12 బృందాల పర్యవేక్ష‍ణ ఒక్కో బృందంలో నలుగురు అధికారులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా శాఖ వాహనాల తనిఖీలకు పూనుకుంది. ప్రధానంగా ఫిట్‌‌నెస్‌ ను పరీక్ష‍ించనుంది. తనిఖీలను తప్పనిసరి చేసింది. ఈనెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న సంగతి తెలసిందే. ఈనేపథ్యంలో స్కూల్‌ ‌బస్సులను కచ్చితంగా తనిఖీ చేయాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పాఠశాల బస్సుల పట్ల కఠినంగా వ్యవహరిచాలని ఆదేశించింది. నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదని హెచ్చరించింది. ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి వరకు పూర్తిస్తాయి పర్యవేక్ష‍ణ అవసరమని స్పష్టం చేసింది. తనిఖీలు చేయకుండా ఉంటే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నీ స్కూల్‌ ‌బస్సుల తనిఖీల విషయంలో రాజీలేకుండా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

గత సోమవారం నుంచే తనిఖీలకు శ్రీకారం చుట్టారు. రవాణా శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 12 మొబైల్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున పది , రాష్టస్థాయిలో రెండు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతీ తనిఖీ బృందంలో నలుగురు వాహన తనిఖీ అధికారులు ఉంటారు. ఉమ్మడి జిల్లా మొబైల్ స్వాడ్లు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర స్థాయి మొబైల్ స్క్వాడ్లు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. తొలి రోజునే నిబంధనలను ఉల్లంఘించిన 211 వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేసినట్టు రాష్ట్ర రవాణా శాఖ ప్రకటించింది. ఇందులో త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్ నెస్ లేని వాహనాలు, ఓవర్ లోడ్ తో తిరిగే వాహనాలు ఉన్నాయి. ఈ తనిఖీలు కొనసాగుతాయనీ రవాణా శాఖ తెలియజేసింది. త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన దారులు వెంటనే ఆ పని చేయాలని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్ష‍ల మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు.

ఇందులో ప్రయివేటు స్కూళ్లల్లో చదివేవారు కూడా ఉంటారు. రోడ్డుభద్రతా ప్రమాణాల పాటించడం ద్వారా విలువైన పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తనిఖీలను ఆదేశించింది. మొత్తం రవాణా శాఖ దగ్గర రిజస్ర్టేషన్‌ ‌చేసుకున్న వాహనాలు 25,987 ఉన్నాయి. ఇందులో గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌పరిధిలో బస్సులు13,400 . ఇకపోతే రంగారెడ్డి, మేడ్చల్‌ ‌జిల్లాల్లో ఈ తరహా స్కూల్‌ అస్సులు అధికం. ఇవేకాకుండా ప్రయివేటు ఇంటర్మీడియట్‌, ఇంజినీరింగ్‌, వృత్తివిద్యా కాలేజీలు సైతం ప్రయివేటు బస్సులను నడుపుతున్నాయి. అయితే బస్సుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండ టంతో పలు ప్రమాదాలు గతంలో జరిగాయి. దీంతో ముక్కుపచ్చలారని పిల్లలతోపాటు ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదివే విద్యార్తుల ప్రాణాలు కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఫిట్‌‌నెస్‌ ‌పరీక్ష‍ చేయకుండా స్కూల్‌ ‌బస్సుల రోడ్డెక్కితే ప్రయివేటు పాఠశాలు, కాలేజీల గుర్తింపును రద్దు చేస్తారు. అలాగే డ్రైవర్ల లైసెన్స్‌‌లను శాశ్వతంగా ఉపసంహరిస్తారు. రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించకపోతే బస్సులు రోడ్డెక్కడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -