శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం
ఈ నెల 15లోగా దరఖాస్తులకు గడువు
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలోని విద్యావంతులైన మైనారిటీ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు అర్హత కలిగిన శిక్షణ సంస్థల నుంచి ప్రతిపాదనలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆహ్వానించింది. ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, యువతకు ఉపాధి కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు భారత ప్రభుత్వ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌డీసీ) అనుబంధ గుర్తింపు పొందిన సంస్థలు ఈ ప్రతిపాదనలు సమర్పించొచ్చు. ఎంపికైన సంస్థలు అభ్యర్థులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతోపాటు, కోర్సు పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది.
జతపర్చాల్సిన పత్రాలివే..
ఆసక్తి గల సంస్థలు తమ దరఖాస్తుతో పాటు సంస్థ నమోదు(రిజిస్ర్టేషన్) ధ్రువీకరణ పత్రాలు, చిరునామా వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఎన్‌ఎస్‌డీసీ లేదా ఇతర గుర్తింపు పొందిన సంస్థల అనుబంధ సర్టిఫికెట్లుతోపాటు మూడు ఆర్థిక సంవత్సరాల ఐటీ రిటర్నులు, ఆడిట్ నివేదికలు అందించాల్సి ఉంటుంది. గత మూడేండ్లలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల వివరాలు, వర్క్ ఆర్డర్లు, థర్డ్ పార్టీ అసెస్‌మెంట్ సర్టిఫికెట్లు, గత ఏడాది కల్పించిన ఉపాధికి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు లేదా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. శిక్షణ కేంద్రం మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల అర్హతలకు సంబంధించిన వివరాలు, ఫొటోలు జత చేయాలి.
ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలి
అన్ని ఆధారాలతో కూడిన ప్రతిపాదనలను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, 6వ అంతస్తు, హజ్ హౌస్, రజాక్ మంజిల్, నాంపల్లి, హైదరాబాద్” చిరునామాలో ఈ నెల 15వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం.. శిక్షణ కోర్సులు, దర ఖాస్తు ప్రక్రియపై సందేహాలు ఉన్నవారు తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయం (040-23244501) లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం (040-23240134) ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని హైదరాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు.
మైనారిటీ యువతకు ‘నైపుణ్య’ శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



