కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలం

నవతెలంగాణ-శంకర్‌పల్లి
కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎం. ప్రభు లింగం అన్నారు.138వ మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా శంకర్‌పల్లి మండల కేంద్రంలో సీపీఐ ఏఐటీసీ శంకర్‌పల్లి చౌరస్తాలో జెండాను సీపీఐ మండల కార్యదర్శి పి. సుధీర్‌ అధ్యక్షతన జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా 138 కార్మిక వార్షికోత్సవాలు ఘనంగా జరుపుతున్న సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని వారు పేర్కొన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వారు తీవ్రంగా విమర్శించారు. నాలుగు లేబర్‌ కోడ్లను తీసుకువచ్చి కార్మికులను అధోగతి పాలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కనీస వేతనం ఇవ్వాలని కార్మికులకు ఈఎస్‌ఐ పీఎఫ్‌ వర్తింపజేయాలని వారు కోరారు. కార్మిక సంఘాలను దేశ స్వతంత్ర పోరాటంలో మొట్టమొదటిగా ఆవిర్భవించిన ఏఐటీయూసీ అని వారి పేర్కొన్నారు. తానున్న కాలం ఏఐటీసీని కార్మిక సంఘాలను బలోపేతం చేసి కార్మికుల పక్షాన పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలని కేంద్రంలో మతోన్మాద ప్రభుత్వాన్ని ఓడించి కార్మికుల హక్కులు సాధించాలని వారు కోరారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎల్బీ రెడ్డి, నరసింహులు, ఏం. అంజయ్య, కొనందా, షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love