పోరాడితే పొయ్యేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మతోన్మాద బీజేపీని ఓడించండి

నవతెలంగాణ-రంగారెడ్ది ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మున్సిపల్‌లో పరిధిలో వివిధ రంగాలకు కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మీరే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం టౌన్‌లో ఏడు ప్రాంతాల్లో జండా ఆవిష్కరణలు చేశారు. మున్సిపల్‌ ఆఫీస్‌, లేబర్‌ అడ్డా, ఆటో ట్రాన్స్‌ పోర్ట్‌ మార్కెట్‌ యాడ్‌, ఆర్టీసీ డిపో డిపో వద్ద హెచ్డి బీఎఫ్‌ ఆధ్వర్యంలో, శేరిగూడ. పండ్ల డబ్బాలు, సీతారాం పేట్‌ ప్రాంతాల్లో ఎర్రజెండాలు ఎగిరేసి మేడే ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం ఇబ్రహీంపట్నం పాషా నరహరి స్మారక కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్య దర్శి జయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ కార్మికులారా ఏకంకండి మతోన్మాద బీజేపీ విచ్చిన్నకర శక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో మేడే పోరాటాల స్ఫూర్తితో పెట్టుబడుదారుల పాలకవర్గాల దోపిడీ, మహిళలపై జరుగుతున్న దాడులు, ప్రజా ఉద్యమాలు అణిచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తులను ఎన్నికలు గెలిపించాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న ఐక్యతను కాపాడుతూ బలమైన ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. 8 గంటల పని దినం కోసం లక్షలాది మంది కార్మికులు ప్రదర్శనపై ఆనాటి పాలకవర్గ ఆదేశాలతో పోలీసులు ప్రదర్శన కారులపై విక్షీనరహితంగా కాల్పులు జరిపారన్నారు. ఆ కాల్పుల్లో అమరులైన అనేకమంది కార్మికుల రక్తంతో తడిపి ఎర్రగుడ్డగా మార్చి ఎగరవేయడం జరిగిందన్నారు. అనేక సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ మోడీ సర్కార్‌ గత పది సంవత్సరాలుగా హరించి ఎనిమిది గంటల పని దినంనీ రద్దు చేసి 12 గంటల పదినాన్ని ప్రవేశపెట్టి యాజమాన్యులకు మేలు చేసేందుకు కార్మిక చట్టాలను సవరించిందన్నారు. నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావడం జరిగిందన్నారు. అందుకని ఎన్నికల్లో బీజేపీని ఓడించి సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షులు సామెల్‌, వ్యవసాయ కార్మిక సంగం జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, సీఐటీయూ జిల్లా సహాయ కార్య దర్శి స్వప్న, జనవిజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పురుషోత్తం, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శంకర్‌, రైతు సంఘం మండల కార్యదర్శి సిహెచ్‌ ముసలయ్య, ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ సీఐటీయూ కన్వీనర్‌ చింతపట్ల ఎల్లేశ, మండల కన్వీనర్‌ బుగ్గరాములు, యాదగిరి, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు పెద్దగారి లక్ష్మయ్య, బండారి యాదయ్య, భవన నిర్మాణ రంగం మండల నాయకులు, దశరథ, వీ.నర్సింహా, సంతోష్‌ కుమార్‌, రాజు జంగయ్య ఉన్నారు.

Spread the love