కార్మికుల హక్కులు ఎర్ర జెండా పోరాటంతోనే సాధ్యం

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి జగదీష్‌
– యాచారంలో ఘనంగా మేడే ఉత్సవాలు
– పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికులు
నవతెలంగాణ-యాచారం
దేశంలో కార్మికుల హక్కులు ఎర్రజెండా పోరా టంతోనే సాధ్యమవుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.జగదీష్‌ అన్నారు. బుధవారం మం డల కేంద్రంలో మేడే ఉత్సవాల్లో భాగంగా డీసీసీబీ బ్యాంకు ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. అనంతరం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, ప్రజా సం ఘాల నాయకులు పెండ్యాల బ్రహ్మయ్య, పి అంజ య్యలు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు. జగదీష్‌ మాట్లాడుతూ 8 గంటల పని విధానం ప్రజా పోరాటాలతోనే సాధ్యమైందని చెప్పారు. మేడే రోజున కార్మికులకు విముక్తి కలిగిన రోజు అని వివరించారు. కంపెనీలో పని గంటలు తగ్గిం చి, కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాల ను కోరారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హ క్కులను బీజేపీ ప్రభుత్వం కాల రాస్తుందని మండి పడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదిం చాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కార్మికుల పక్షాన నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను బల పరచాలని కార్మికులకు పిలుపునిచ్చారు. భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్‌ను కార్మికులం తా ఓట్లేసి గెలిపించాలని తెలిపారు. కార్యక్ర మం లో సీఐటీయూ మండల కన్వీనర్‌ చందు నాయక్‌, రైతు సంఘం మండలాధ్యక్షుడు కె తావునాయక్‌, కెేవీపీఎస్‌ మండల కార్యదర్శి మాజీ సర్పంచ్‌ దంతు క పెద్దయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలంప ల్లి జంగయ్య, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్య క్షుడు పి.వెంకటయ్య, ఐద్వా మండల కార్యదర్శి మ స్కు అరుణ, వ్యకాసంఘం నాయకురాలు పుష్ప, నాయకులు బి కృష్ణ, బాలయ్య, గోదాసు నరసింహ, సాయికుమార్‌, మల్లారి, చంద్రకళ, రాములు, గణే ష్‌, సతీష్‌, బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love