శ్రమతో వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగాళ్ల భాస్కర్‌
నవతెలంగాణ-తుర్కయంజాల్‌
కార్మికుల శ్రమ వలన వచ్చే అదనపు విలువ పంపిణీ జరగాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కా డిగాళ్ల భాస్కర్‌ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్స వం మేడేను పురస్కరించుకొని తుర్కయంజాల్‌ ము న్సిపల్‌ పరిధిలోని కోహెడ, తొర్రూరు, మునగనూ ర్‌, బ్రాహ్మణపల్లి, ఇంజాపూర్‌, కమ్మగూడ, రాగ న్నగూడ తుర్కయాంజాల్‌ గ్రామాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల పరిశ్రమల కార్మికులు బుధవారం జెండాలు ఎగరవేసి మేడే కార్యక్రమం లో పాల్గొన్నారు. తుర్కయాంజాల్‌ చౌరస్తా అంబే ద్కర్‌ విగ్రహం నుండి రొక్కం సత్తిరెడ్డి కల్యాణ మం డపం వరకు కార్మికులు ఉద్యోగులతో భారీ ప్రదర్శ న నిర్వహించి హాల్‌ ముందు జెండావిష్కరణ చేశా రు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డి కిషన్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె భాస్కర్‌ మాట్లాడుతూ కార్మికులు తమ రక్తంధార పోసి శ్రమిస్తే వచ్చే అదనపు లాభం ద్వారానే పెటు ్టబడుదారులు సంపద పోగేస్తున్నారని కార్మికుల ద్వారా వొచ్చే అదనపు విలువ ఏ సంపదా కార్మికు లకు పంపిణీ జరగాల్సిందేనని అన్నారు. మేడే దినో త్సవ సందర్భంగా ప్రభుత్వం కార్మికులకు వ్యతిరే కంగా ఉందనడానికి నిదర్శనం మేడే రోజు కూడా ఉపాధి హామీ పనులతో పాటు వివిధ ప్రభుత్వ శా ఖల్లో కార్మికులతో పని చేయించడం అన్యా యమన్నారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించాలని నిరంతరం కార్మికుల పక్షాన పోరా డుతున్న ఎర్రజెండా ముద్దు బిడ్డ సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండీ జహంగీర్‌ సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని చట్టసభల్లోకి కమ్యూని స్టులను పంపితేనే కార్మికులకు న్యాయం జరుగు తుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తుర్క యంజాల్‌ సీఐటీయూ నాయకులు ఎం.సత్య నా రాయణ, కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, అడ్వకేట్‌ కె.అరుణ్‌ కుమార్‌, నాయకులు భాస్కర్‌, శంకర్‌, వెంకట కృష్ణ, శంకరయ్య, మాల్యాద్రి, కృష్ణ, రవి, మధు, శారద, బీరప్ప, బాల్‌రాజ్‌, ఆశీర్వాదం, మాధవ రెడ్డి, జాఫర్‌, మెతరి దాసు, నవీన్‌, మహే ష్‌, యాదగిరి, గోపాల్‌, శ్రీను, రవి, లక్ష్మి, జంగమ్మ, పుష్పమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love