ప్రజాసేవలోనే ఉంటా

– కాంగ్రెస్‌ మండల మహిళా అధ్యక్షురాలు,
– వైస్‌ ఎంపీపీ మధులత శ్రీనివాస్‌చారి
నవతెలంగాణ-పెద్దేముల్‌
తమకు ఆస్తులపై ప్రేమ లేదని, చివరి రక్తం బొట్టు వరకు ప్రజా సేవలోనే ఉంటానని మండల కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు వైస్‌ ఎంపీపీ మధులత శ్రీనివాస్‌ చారి అన్నారు. బుధవారం మండలంలో పెద్దేముల్‌, తింసాన్‌పల్లి, గోపాల్‌పూర్‌, నాగులపల్లి, మంబాపూర్‌, కందనెల్లి, గాజీపూర్‌, ఇందూర్‌, తట్టేపల్లి, తదితర గ్రామాల్లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి మద్దతుగా ప్రతి ఇంటికి వెళ్తు 6 గ్యారెంటీ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీల దగ్గరకు వెళ్లి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఉపాధి కూలీలకు రాగి అం బలి పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే 4 గ్యారంటీలు అమలు చేసిందని, ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ మాటకు కట్టుబడి ఉన్నామన్నారు. మహిళలకు మంచి జర గాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే, ప్రతి మహిళా ఖాతాలలో రూ. 8.500 ఉపాధి కూలీ లకు రోజుకు 150 పని దినాలు కల్పించడంతోపాటు రోజుకు రూ.400 వేతనం అందిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ కో ఆప్షన్‌ సభ్యులు నసీ ర్‌, మండల కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పెండ్యాల ప్రవీణ్‌ కుమార్‌ గుప్తా, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు కిరణ్‌, తాండూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మెన్‌ జితేందర్‌ రెడ్డి, గ్రామ కమిటీల అధ్యక్షులు జైపాల్‌ రెడ్డి, మైపూస్‌, డీవై.నర్సింలు, పార్టీ సీనియర్‌ నేతలు డీవై.నర్సింలు, రవిశంకర్‌, బందప్ప, సాయిలు, హనీఫ్‌, ఇక్బాల్‌, రవి, శేఖర్‌, కార్యకర్తలు తదితరులున్నారు.

Spread the love