కేంద్రంలో ప్రజాపాలన రావడం ఖాయం

– కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి , ఏఐసీసీ కార్యదర్శి విష్ణు
– మైసిగండి మైసమ్మ ఆలయంలో స్థానిక
– నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు
– ఆడపడుచు లాంచనంగా దీపాదాస్‌కు పట్టు వస్త్రాలు అందజేసిన ఎమ్మెల్యే
– ఘన స్వాగతం పలికిన టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్‌
నవతెలంగాణ-ఆమనగల్‌
కేంద్రంలో ప్రజా పాలన రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షి అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కల్వకుర్తి నియోజకవర్గంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె ఏఐసీసీ కార్యదర్శి విష్ణు తదితరులతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా నియోజకవర్గం ముఖద్వారమైన కడ్తాల్‌ మండల కేంద్రంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌ గౌడ్‌, పార్టీ శ్రేణులతో కలిసి దీపాదాస్‌ మున్షి తదితరులకు ఘన స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా మార్గమధ్యలోని మైసిగండి మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి విష్ణు తదితరులతో కలిసి ఆమె ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆడపడుచు లాంచనంగా దీపాదాస్‌ మున్షిని పూల మాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి, చీర సారె అందజేశారు. అనంతరం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో దీపాదాస్‌ మున్షి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు అనుకూలంగా రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకోసం ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అధిష్టానం నిరుద్యోగుల కోసం, ప్రకటించిన యువన్యాయం, మహిళల కోసం నారీ న్యాయం, రైతుల కోసం రైతు న్యాయం, సామాజిక, ఆర్థిక, కులగణన హక్కుల కోసం సామాజిక న్యాయం, శ్రామికులు, కార్మికులు, ఉపాధి కూలీల కోసం ప్రకటించిన శ్రామిక న్యాయం తదితర గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ సింగ్‌, కల్వకుర్తి కోఆర్డినేటర్‌ ఇందిరా శోభన్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీపాతి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్‌, మండల అధ్యక్షులు సబావత్‌ బిచ్యా నాయక్‌, తెల్గమల్ల జగన్‌, పట్టణ అధ్యక్షులు రాంచందర్‌ నాయక్‌, వస్పుల మానయ్య, సీనియర్‌ నాయకులు గుర్రం కేశవులు, వస్పుల జంగయ్య, జవాహర్‌ లాల్‌ నాయక్‌, ఎంపీపీ అనిత విజరు, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత్‌ రెడ్డి, సింగిల్‌ విండో డైరెక్టర్‌ చేగూరి వెంకటేష్‌, యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కేతావత్‌ హీరాసింగ్‌ నాయక్‌, మాజీ సర్పంచ్లు శంకర్‌, శేఖర్‌ గౌడ్‌, ఎస్సీ సెల్‌ పి.అశోక్‌,మండ్లి రాములు, హన్మానాయక్‌, లక్ష్మయ్య, గూడూరు భాస్కర్‌ రెడ్డి, జహంగీర్‌ అలి, కృష్ణానాయక్‌, చందోజీ, జర్పుల లక్పతినాయక్‌, యాదయ్య, వినోద్‌, విజరు, మల్లయ్య, వెంకటేష్‌, రామకృష్ణ, తులసిరాం నాయక్‌, జంగయ్య, రాజేందర్‌, రాజేష్‌, శేఖర్‌, ప్రభు,మంకీ శ్రీను, శ్రీకాంత్‌, నరేష్‌ నాయక్‌, విజరు రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love