ప్రపంచ కార్మికులారా ఏకంకండి మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ఓడించండి

– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస చంద్రయ్య
నవతెలంగాణ-కొడంగల్‌
ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని మతోన్మాద విచ్ఛిన్నకర శక్తులను ఓడించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య అన్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని దౌల్తాబాద్‌, బోంరాస్‌పేట్‌ మండలాల్లో మున్సిపల్‌, గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మేడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా దేశంలోని చికాగో నగరంలో హే మార్కెట్లో ఎనిమిది గంటల పని దినం కోరుతూ లక్షలాదిమంది కార్మికుల ప్రద ర్శనపై ఆనాటి పాలకవర్గాలు ఆదేశాలతో పోలీసులు ప్రదర్శన కారులపై విచక్షణ రహితంగా కాలుపులు జరిపారని ఈ దాస్టికాన్ని మే డే పోరాట వీరులు వీరోచితంగా ప్రతిఘటించారని గుర్తు చేశారు. కార్మికవర్గం పోరాడి సాధించిన హక్కులను కేంద్రంలోని మోడీ సర్కార్‌ నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. పదేండ్లుగా పాలించిన బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు వాగ్దానాలతో పార్లమెంట్‌ ఎన్నికల్లో నాన తంటాలు పడుతుందని విమర్శించారు. ఎనిమిది గంటల పని దినాన్ని రద్దుచేసి 12 గంటల పని దినాన్ని ప్రవేశ పెట్టి, యజమానులకు మేలు చేసే మోడీ ప్రభు త్వాన్ని గద్దె దించడమే ధ్యేయంగా కార్మి కులంతా ఏకం కావాలని కోరారు. స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్లకు ఆర్థిక ప్రయోజనాల కోసం , పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను , కార్మి కుల హక్కులను కాపాడుకునేందుకు కార్మి కులంతా ఏకమై, మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ వర్కర్ల దౌల్తాబాద్‌ మండల అధ్యక్షులు కుర్మాని సాయిలు, దాసు, సాయమ్మ, రాములు, అంజి, మున్సిపల్‌ కార్మికుల సంఘం అధ్యక్షులు పకీరప్ప, మొగులప్ప, కిష్టప్ప, సుగుణమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు.

Spread the love