Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయువతతో మోడీ సర్కార్‌ చెలగాటం

యువతతో మోడీ సర్కార్‌ చెలగాటం

- Advertisement -

కేంద్ర విద్యాశాఖ మంత్రిరాజీనామా చేయాలని డిమాండ్
చలో పార్లమెంట్‌కు మద్దతుగా ధర్నా చౌక్‌లో నిరసన
నవతెలంగాణ-ముషీరాబాద్

పేపర్ లీక్‌లపై విద్యార్థులు, యువత ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన చలో పార్లమెంట్ నిరసనకు మద్దతుగా హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాసిస్టు బీజేపీ పాలనలో పేపర్ లీక్‌లు పరిపాటిగా మారాయని ఆరోపించారు. ఎన్నో ఏండ్లుగా కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఇప్పటికే 40 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ‌తెలిపారు. విద్యను సరుకుగా మార్చి లాభాల కోసం పనిచేస్తున్న వ్యవస్థే ఇందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థపై జరుగుతున్న దాడిలో పేపర్ లీక్‌‌లు ఒక భాగమని, వాటిని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. విద్యా రంగంలో జరుగుతున్న అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఎవరైనా సరే విద్యా వ్యవస్థలో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులు, విద్యార్థులపై అణచివేత కొనసాగుతోందని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తు న్నారని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం పోరాడుతున్న నిరుద్యోగులను అణచివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలనకు తెరలేపిందని ఆరోపిం చారు.
దేశ ప్రజలు, విద్యార్థులు, యువత ఐక్యమై విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం సంఘటిత ఉద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రతి విద్యార్థికి ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలని, విద్య ప్రయివేటీకరణను నిరోధించాలని డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్లు విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాట మాడుతూ ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా హాస్టళ్లు, కోచింగ్ కేంద్రాలు నిర్వహించి విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు.​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -